|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రికార్డుల వేటలో వేల కోట్లు: అక్కినేని కోడలు శోభితను ఆకట్టుకున్న ఆ బ్లాక్ బస్టర్ ఏది?

Published: 28-12-2025, 8:51 AM
రికార్డుల వేటలో వేల కోట్లు: అక్కినేని కోడలు శోభితను ఆకట్టుకున్న ఆ బ్లాక్ బస్టర్ ఏది?
  • శోభిత ధూళిపాళ నాగచైతన్యతో వివాహం తర్వాత అక్కినేని కోడలిగా ట్రెండింగ్‌లో ఉంది.
  • తాజాగా ఆమె ధురంధర్ సినిమా చూసి, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశంసలు కురిపించింది.
  • ఆదిత్యాధర్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ నటించిన ధురంధర్ రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది.
  • ఈ సినిమా 2024లో అత్యధిక కలెక్షన్లు సాధించిన 9వ చిత్రంగా నిలిచి సంచలనం సృష్టించింది.

అక్కినేని కోడలిగా ట్రెండింగ్‌లో ఉన్న శోభిత ధూళిపాళ ఇటీవల ఒక సినిమా చూసి ఎంతగానో ఆకట్టుకుంది. రికార్డులు సృష్టిస్తూ రూ.1000 కోట్లు వసూలు చేసిన ఆ సినిమా వివరాలను, శోభిత పోస్ట్ చేసిన ఆసక్తికర విషయాలను ఈ కథనంలో చూడండి.

శోభిత పోస్ట్ వెనుక అసలు కథ

Sobhita Dhulipala:అక్కినేని వారసుడు నాగచైతన్య.. సమంత నుంచి విడిపోయిన తర్వాత శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడి గత ఏడాది పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మొదటి వివాహ వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకుంది ఈ జంట. నిజానికి శోభిత ధూళిపాళ్ల ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని అమ్మాయి. వాస్తవానికి తెలుగమ్మాయి అయినా బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేయడం వల్ల ఈమెను ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు.

కానీ ఎప్పుడైతే నాగచైతన్యతో ప్రేమలో పడిందో అప్పటినుంచి ట్రెండింగ్ లోకి వచ్చేసింది శోభిత. ఇప్పుడు అక్కినేని కోడలిగా చలామణి అవుతూ తన స్టేటస్ తోనే కాదు మంచి మనసుతో కూడా అందరి హృదయాలను దోచుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా ఒక సినిమా చూసిన ఈమె ఆ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఆ సినిమా గురించి చెప్పుకొచ్చింది. మరి అక్కినేని కోడల్ని మెప్పించిన ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఏమిటా రికార్డుల మూవీ?

అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా ప్రేక్షకుల చేత ప్రశంసలు పొందుతూ.. 21 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించిన చిత్రం ధురంధర్. ఆదిత్యాధర్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ వచ్చిన ఈ సినిమా టి20 ప్లేయర్లను కూడా మెప్పించింది. అలాంటి ఈ సినిమాని తాజాగా అక్కినేని కోడలు చూసినట్టుంది. ఈ నేపథ్యంలోనే సినిమాపై ప్రశంసలు కురిపించింది. తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా..”వావ్..వావ్..వావ్.. ఉత్కంఠ భరితమైనది.. స్ఫూర్తిదాయకం.. మైండ్ బ్లోయింగ్..మిగతా వాటిలా కాదు.. ఆదిత్య , రణ్ వీర్ అదరగొట్టేశారు. సారా అర్జున్ ప్రతిభ, అందం గురించి పొగడకుండా ఉండలేకపోతున్నాను” అంటూ రాసుకుంది.

ఇక చివరిలో తన పోస్ట్ కి సెల్యూట్ చేస్తున్న ఎమోజీలతో పాటు నమస్కారం చేస్తున్న ఏమోజీ , అలాగే హార్ట్ సింబల్స్ ని కూడా ఎమోజిలుగా జోడించింది. మొత్తానికి అయితే శోభిత ధూళిపాళ్ల ఇన్స్టా స్టోరీ ద్వారా పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

సోషల్ మీడియాలో వైరల్

ఇకపోతే ధురంధర్ సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. అంతేకాదు ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో టాప్ 9వ స్థానాన్ని దక్కించుకుంది. అలాగే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన నాల్గవ హిందీ చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది.స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని జ్యోతి దేశ్ పాండే జియో స్టూడియోస్, ఆదిత్య, లోకేష్ యొక్క బి 62 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ , మానవ్ గోల్, నవీన్ కౌశిక్ , సౌమ్య తాండూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుమారుగా 250 నుండి 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.1051.60 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా పార్ట్ 2 కూడా వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది.

మొత్తం మీద, శోభిత ధూళిపాళ ఇన్‌స్టా స్టోరీ ద్వారా ధురంధర్ సినిమాపై చేసిన ప్రశంసలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వేల కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.