|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akshaya Tritiya: లక్ష్మీదేవి అక్షయ తృతీయ నాడు ఈ 5 రాశులకు కాసుల వర్షం కురిపిస్తుంది.. డబ్బు, ప్రమోషన్లతో పాటు ఎన్నో!

Published: 16-04-2025, 11:44 PM
Akshaya Tritiya: లక్ష్మీదేవి అక్షయ తృతీయ నాడు ఈ 5 రాశులకు కాసుల వర్షం కురిపిస్తుంది.. డబ్బు, ప్రమోషన్లతో పాటు ఎన్నో!

అక్షయ తృతీయ పర్వదినం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కొన్ని రాశుల వారికి అపారమైన ఆర్థిక లాభాలను, ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. ఈ కథనంలో ఆ 5 అదృష్ట రాశుల గురించి తెలుసుకుందాం.

Key Points

1

అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అనుగ్రహం 5 రాశులపై ఉంటుంది.

2

కర్కాటక, తులా, మకర, కుంభ, వృషభ రాశుల వారికి ఆర్థిక లాభాలు.

4

ఆస్తుల కొనుగోలు, ఆర్థిక పురోగతి సాధ్యం.

అక్షయ తృతీయ యోగాలు మరియు వాటి ప్రభావం

ఈసారి అక్షయ తృతీయ ఏప్రిల్ 30న వచ్చింది. ఈరోజు అనేక శుభయోగాలు కూడా ఉన్నాయి. లక్ష్మీనారాయణ రాజయోగం, గజకేసరి యోగం, సర్వార్థ సిద్ది యోగం ఏర్పడతాయి. ఈ యోగాలు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకువస్తాయి. ఈ యోగాల కారణంగా ఐదు రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. లక్ష్మీదేవి సంపద వర్షాన్ని కురిపిస్తుంది.

కర్కాటక రాశి వారికి అక్షయ తృతీయ నాడు శుభ ఫలితాలు ఉంటాయి. విజయాన్ని అందుకోవడంతో పాటుగా అనుకున్న ఉద్యోగం వస్తుంది. బంగారం, వెండి, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్స్ వ్యాపారులకి కూడా సంపాదన పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.

తులా రాశి వారికి అక్షయ తృతీయ నాడు శుభ యోగాల వలన అనేక లాభాలు కలుగుతాయి. రావాల్సిన డబ్బులు చేతికి వస్తాయి. మీ అందం పెరుగుతుంది. కొత్త మార్గంలో డబ్బులని సంపాదిస్తారు. వాహనాలు, ఆస్తులని కొనుగోలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు.

లక్ష్మీదేవి అనుగ్రహం పొందే 5 అదృష్ట రాశులు

మకర రాశి వారికి అక్షయ తృతీయ నాడు కలిసి వస్తుంది. అక్షయ తృతీయ నాడు ఈ రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి ఆశీస్సులు వీరిపై ఉంటాయి. శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు కూడా ఈ రాశి వారిపై ఉంటాయి. కొత్త మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటారు. కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి కూడా ఇది అనుకూలమైన సమయం.

కుంభ రాశి వారికి అక్షయ తృతీయ నాడు మంచి జరుగుతుంది. ఆ రోజు నుంచి శుభ ఘడియలు మొదలవుతాయి. కొత్త ప్రాజెక్టులు, వ్యాపారంలో లాభాలు ఇలా ఎన్నో ఉంటాయి అనుకున్న వాటిని నెరవేరుస్తారు. రావాల్సిన డబ్బు కూడా చేతికి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

ఆర్థిక లాభాలు మరియు ఉద్యోగ అవకాశాలు

వృషభ రాశి వారికి అక్షయ తృతీయ నాడు అనేక లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకి పురోగతి ఉంటుంది. కెరీర్ లో కూడా అనేక మార్పులు ఉంటాయి. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. ఈ రాశి వారు అక్షయ తృతీయ నాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా ఎక్కువ లాభాలు వస్తాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఈ రాశిఫలాలు సూచనలు మాత్రమే. నిజ జీవితంలో ఫలితాలు వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి. నిపుణుల సలహా తీసుకోండి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.