|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అక్షయ తృతీయ: స్వయంపాక దానంతో బ్రహ్మాండ ఫలితం!

Published: 29-04-2025, 7:11 AM
అక్షయ తృతీయ: స్వయంపాక దానంతో బ్రహ్మాండ ఫలితం!

అక్షయ తృతీయ పర్వదినం నాడు స్వయంపాక దానం చేయడం చాలా ముఖ్యం. బ్రాహ్మణులకు స్వయంపాకం, ఇతర వస్తువులు దానం చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.

Key Points

1

అక్షయ తృతీయ రోజున స్వయంపాక దానం చేయడం శుభప్రదం.

2

బ్రాహ్మణుడికి స్వయంపాకంతో పాటు అంచు కలిగిన పంచె, గొడుగు, చెప్పులు దానం చేయండి.

4

ఈ దానాలతో పితృదేవతలకు తృప్తి కలిగి, బ్రహ్మాండ దాన ఫలితం లభిస్తుంది.

అక్షయ తృతీయ మహిమ

అక్షయ తృతీయ రోజున బంగారం కొనమని ఎవరు చెప్పారో తెలీదు కానీ అది చాలా పెద్ద తపు. బంగారం అంటే కలి పురుషుడు. అంటే ఈ రోజు బంగారం కొనడం పాపాన్ని ఇంటికి తెచ్చుకోవడమే అని ప్రముఖ ఆధ్యాత్మికవెత పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అక్షయ తృతీయ జీవుడికి తృప్తి ఇస్తుంది. జీవులు బెంగ పెట్టుకోకుండా సర్వ కాలాలలోనూ ఉండేందుకు సంవత్సరానికి ఒకసారి మహా శివుడు కల్పించిన మహోత్కృష్టమైన తిథి అక్షయ తృతీయ అని చిలకమర్తి తెలిపారు.

అక్షయం అంటే ఖర్చు కానిది. ఈ అక్షయ తృతీయ కర్ణుడి కథలోంచి వచ్చింది. ఏ జన్మలో అయినా పితృదేవతలకు ఆకలి లేకుండా మండేందుకు అక్షయ తృతీయ రోజున చేసే దానమే చాలా ముఖ్యం. పితృదేవతలకు దారుణ శాపం దాహం. వారికి నీళ్ళు దొరకవు, అందుకే జీవి మరణానంతరం పదవ రోజున ధర్మోదకాల పేరుతో నీళ్ళు విడుస్తారు. ప్రేమ కలిగిన వారు, బంధువులు ఇలా ధర్మోదకాల ద్వారా వదిలిన నీళ్ళే పరలోక జజీవికి దాహార్తి తీరుస్తాయి.

అక్షయ తృతీయ రోజున ఓ బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వడం వలన పితృ దేవతలకు ఎంతో తృప్తి కలుగుతుంది. అంచు కలిగిన పంచె, వేసవి కావడంతో గొడుగు, చెప్పులు కూడా దానం చేయడం మంచిది. యజమాని ఒక్కరే ఇలా స్వయంపాకం ఇవ్వవచ్చు. అయితే భార్య కూడా జత ఉండి, పసుపు కుంకుమలు, చీర జాకెట్ ముక్కలు దానం చేస్తే, ఆమె జన్మజన్మలూ సువాసినిగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది అని తెలిపారు.

దానం చేయాల్సిన వస్తువులు

స్వయంపాకం అంటే స్వీకరించిన వారు సంతృప్తి చెందాలి.

ముఖ్యంగా ఇవ్వాల్సిన మూడు వస్తువులు

పితృ తృప్తికి దానం

పైన చెప్పినవి దానం చేస్తే బ్రహ్మాండాన్ని దానం చేసినంత ఫలితం అని చిలకమర్తి తెలిపారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

అక్షయ తృతీయ రోజున చేసే దానం పితృదేవతలకు తృప్తిని కలిగించి, మనకు అపారమైన ఫలితాలను అందిస్తుంది. పైన పేర్కొన్న వస్తువుల దానం ద్వారా శుభ ఫలితాలను పొందండి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.