
📌 Key Points
- తారకరత్న మరణించి మూడు సంవత్సరాలు అవుతున్నా అలేఖ్య జ్ఞాపకాల నుంచి బయటపడలేదు.
- సోషల్ మీడియాలో తారకరత్న జ్ఞాపకాలను అలేఖ్య పంచుకుంటున్నారు.
- తారకరత్న మరణం తర్వాత అలేఖ్యను ఆయన కుటుంబం చేరదీయలేదు.
- మంగళసూత్రంతో తారకరత్న ఫోటోకు అలేఖ్య నివాళి అర్పించారు.
నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య సోషల్ మీడియాలో తరచుగా తన భర్త గురించిన జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. తాజాగా ఆమె తన మంగళసూత్రంతో తారకరత్న ఫోటోకి నివాళి అర్పిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
తారకరత్న మరణం తర్వాత అలేఖ్య
Alekhya Tarakaratna: అలేఖ్య నందమూరి పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడుగా పలు సినిమాలలో హీరోగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తారక రత్న 2023వ సంవత్సరంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈయన లోకేష్ పాదయాత్రలో పాల్గొని స్పృహ కోల్పోయి పడిపోయారు. దాదాపు 23 రోజులపాటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తారకరత్న మరణించిన సంగతి తెలిసిందే. ఇలా తారకరత్న మరణించి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ అలేఖ్య మాత్రం తన భర్త జ్ఞాపకాల నుంచి బయటపడలేదని చెప్పాలి.
తన భర్త మరణం తర్వాత అలేఖ్య తారకరత్న సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన పిల్లలకు అలాగే తన భర్త జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తారకరత్నతో తన పరిచయం ప్రేమ పెళ్లి గురించి, తన మరణం గురించి ఆయన మరణం తర్వాత ఎదుర్కొన్న పరిణామాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని తారకరత్న తల్లిదండ్రులు ఇప్పటికీ తనని చేరదీయ లేదు. కనీసం తన పిల్లల నైన హక్కును చేర్చుకుంటే బాగుంటుందని ఈమె తన మనసులో భావాలను బయటపెట్టారు.
మంగళసూత్రంతో అలేఖ్య భావోద్వేగం
ఇలా తండ్రి ప్రేమకు దూరం అయి అయిన వాళ్లకు అలేఖ్య తన భర్త జ్ఞాపకాలలో బ్రతుకుతున్నారని చెప్పాలి. ఇక తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా తన భర్త గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. అలేఖ్య రెడ్డి తన భర్త తారకరత్నను ముద్దు పెట్టుకున్నటువంటి ఒక ఫోటోకి ఈమె తన మంగళసూత్రం వేశారు. ఇలా ఆ మంగళసూత్రం వేసిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు దాన్ని ధరించాల్సిన అవసరమే రాలేదు… ఇప్పుడది నా చేతిలో ఉంది. ఎందుకంటే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అంటూ ఈమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా తన భర్త బ్రతికే ఉన్నాడంటూ ఎమోషనల్ అవుతూ ఈమె ఈ సందర్భంగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
అభిమానుల స్పందన
ఇలా తన భర్తను తలుచుకుంటూ ఈమె సోషల్ మీడియా వేదిక ఈ పోస్ట్ చేయడంతో ఎంతో మంది అభిమానులు ఈమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా తన భర్త చనిపోయి మూడు సంవత్సరాలైనా ఇంకా ఈమె అదే జ్ఞాపకాలలో ఉండడంతో మీరు మరింత స్ట్రాంగ్ అవ్వాలి అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక తారకరత్న ఒకానొక సమయంలో వరుస సినిమాలలో హీరోగా నటించిన ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈయన మాత్రం ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు.. ఇలా ఇండస్ట్రీకి దూరమైన తారకరత్న తిరిగి పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలోకి వచ్చే ప్రయత్నాలు చేశారు అందులో భాగంగానే పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే పాదయాత్రలో ఒక్కసారిగా స్పృహ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
తారకరత్న మరణం తర్వాత అలేఖ్య జీవితం విషాదంగా మారింది. ఆమె తన భర్త జ్ఞాపకాలతో జీవిస్తూ, సోషల్ మీడియా ద్వారా తన భావాలను పంచుకుంటున్నారు. ఆమె మరింత ధైర్యంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.


