|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తారకరత్న ప్రేమ కథ: అలేఖ్య మనోగతం! పెళ్లి రహస్యాలు, కుటుంబ సమస్యలు బయటపెట్టిన అలేఖ్య!

Published: 09-03-2026, 11:35 AM
తారకరత్న ప్రేమ కథ: అలేఖ్య మనోగతం! పెళ్లి రహస్యాలు, కుటుంబ సమస్యలు బయటపెట్టిన అలేఖ్య!
  • తారకరత్న, అలేఖ్యల పరిచయం హైదరాబాద్‌లో జరిగిందని అలేఖ్య వెల్లడించారు.
  • డివోర్స్ తర్వాత తారకరత్న మంచి స్నేహితుడు అయ్యారని అలేఖ్య తెలిపారు.
  • తారకరత్న తన ఫ్యామిలీలో అలేఖ్యను అంగీకరించలేదని ఆమె అన్నారు.
  • తారకరత్న చాలా సరదాగా ఉండేవారని, అందరినీ ఆప్యాయంగా పలకరించేవారని అలేఖ్య గుర్తు చేసుకున్నారు.

దివంగత నటుడు తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి మొదటిసారిగా తన ప్రేమ కథ గురించి ఓపెన్ అయ్యారు. తారకరత్నతో తన పరిచయం, ప్రేమ, పెళ్లి గురించి ఆమె అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అలేఖ్య, తారకరత్నల తొలి పరిచయం

Alekhya Tarakaratna: దివంగత నటుడు తారకరత్న గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారకరత్న ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడపారు. అయితే ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైన తారకరత్న రాజకీయాలలోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలోనే ఈయన గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇలా తారకరత్న మరణం తర్వాత ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి (Alekhya Reddy)మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అలేఖ్య రెడ్డి తారకరత్నతో తన పరిచయం, ప్రేమ, పెళ్లి గురించి పలు విషయాలను తెలిపారు. తారకరత్న తనకు హైదరాబాదులోనే పరిచయమయ్యారని తెలిపారు. తన మొదటి పెళ్లి డివర్స్ తర్వాత తారకరత్న పరిచయమయ్యారని, మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యామని తెలిపారు. ఇలా తారకరత్న బెస్ట్ ఫ్రెండ్ కావడంతో తరచూ మా ఇంటికి వచ్చి వెళ్లేవాడు. మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అయ్యాడు. ఇలా ఫ్రెండ్ గా ఉన్న తారకరత్న ఒకసారి తనకు పెళ్లి ప్రపోజల్ చేశారు. అప్పటికే డివోర్స్ తీసుకున్న నేను ఇది యాక్సెప్ట్ చేయలేకపోయానని ఇలా కొంత టైం తర్వాత తను మా ఇంట్లో మా అమ్మ నాన్నలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారని తెలిపారు.

ప్రేమ, పెళ్లి గురించి అలేఖ్య వెల్లడి

తారక్ తో తన పెళ్లి మా ఇంట్లో వాళ్లకి ఇష్టమే కానీ తారక్ ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేయలేదని తెలిపారు. ఇప్పటికి కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదని ఎప్పటికైనా మమ్మల్ని వారి ఫ్యామిలీగా హక్కున చేర్చుకుంటారని ఎదురు చూస్తున్నానంటూ అలేఖ్య తెలిపారు. తారక్ నన్ను పెళ్లి చేసుకోవడం, తన ఫ్యామిలీ ఎందుకు మమ్మల్ని దూరం పెట్టారనే విషయాలు ఇప్పటివరకు నాకు తెలియదని అలేఖ్య తెలిపారు. ఎప్పటికైనా తన పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారని తారక్ చాలా నమ్మకంగా ఉండేవారు కానీ ఆ కోరిక నెరవేరలేదని తెలిపారు. ఇక తారకరత్న గురించి మాట్లాడుతూ చాలా సరదాగా ఉండే మనిషి ఎవరినైనా తమ్ముడు ,అన్న అంటూ ఆప్యాయంగా పలకరిస్తారని అలేఖ్య తెలిపారు.

అచ్చం బాల బాబాయ్ మనస్తత్వం..

కుటుంబ సభ్యుల అంగీకారం కోసం ఎదురుచూపులు

తారకరత్నది చిన్నపిల్లల మనస్తత్వం. అచ్చం బాల బాబాయ్ లాగే తారకరత్న వ్యవహార శైలి కూడా ఉండేదని అలేఖ్య తెలిపారు. ఇక మా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు కూడా ఉండేవి ఇలా గొడవలైన ప్రతిసారి ఓబు (తారకరత్న) ముందు సారీ చెప్పేవాడు. మా ఇంట్లో ముగ్గురు పిల్లలు కాదు నలుగురు పిల్లలు ఉండేవారని అతను కూడా పిల్లలతో కలిసి గోల చేసేవారని అలేఖ్య తారకరత్న గురించి ఎన్నో తెలియని విషయాలను బయటపెట్టారు. ఇక పిల్లల విషయంలోనే మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చేవని ఓబు పిల్లలు బాగా బుజ్జగించేవారు అంటూ తన భర్త గురించి అలేఖ్య రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తారకరత్న లేని లోటును అలేఖ్య గుర్తు చేసుకున్నారు. వారి బంధం ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తారకరత్న జ్ఞాపకాలు ఆమెకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయని తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.