
📌 Key Points
- కోకాపేటలో అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- సినీ పరిశ్రమకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుందని అల్లు అరవింద్ ప్రకటన
- హైదరాబాద్‌ను ఫిల్మ్ క్యాపిటల్‌గా చూడాలనేది సీఎం రేవంత్ ఆకాంక్ష
- ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డాల్బీ థియేటర్లలో ఒకటి హైదరాబాద్‌లో ఉంది
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసించారు. కోకాపేటలో ప్రారంభించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు చేస్తున్న సహాయాన్ని కొనియాడారు.
అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం
Allu Aravind: కోకాపేటలో అధునాతన టెక్నాలజీతో రూపొందించిన అల్లు సినిమాస్ (Allu Cinemas) మల్టీప్లెక్స్‌ను గురువారం (మార్చి 12) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) చేతుల మీదుగా గ్రాండ్‌గా ప్రారంభించింది అల్లు ఫ్యామిలీ. ఈ వేడుకలో సీఎం రేవంత్‌పై నిర్మాత అల్లు అరవింద్ పొగడ్తల వర్షం కురిపించారు.
ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ (Allu Aravind) మాట్లాడుతూ.. ఈ సందర్భంగా నేను ముగ్గురు వ్యక్తులను గుర్తు చేసుకోవాలి. 50 సంవత్సరాల క్రితం ఈ ఇండస్ట్రీని అంటరాని ఇండస్ట్రీగా చూశారు. ఈ సొసైటీలో నాన్న నన్ను ప్రోత్సహించి, నువ్వు ఈ ఇండస్ట్రీలో దీక్షతో పనిచేస్తే పైకొస్తావని చెప్పడమే కాకుండా, తన కుమార్తెని 45 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అటువంటి భావం కలిగిన ఆయన పై నుంచి ఇదంతా చూస్తూ ఆనందపడుతుంటారని భావిస్తున్నాను. రెండో వ్యక్తి.. ఎంతోమందికి తను ఇన్‌స్పిరేషన్‌గా నిలిచి, ఎంతో మందికి హీరోలవడానికి ఒక బాట వేసిన మెగాస్టార్ చిరంజీవి. ఇంకా నాకు ఈ ఎగ్జిబిషన్ సెక్టార్ మీద ఇంట్రస్ట్ కలగజేసిన ఏషియన్ ఫిలింస్ నారాయణ దాస్ నారంగ్.
రేవంత్ రెడ్డిపై అల్లు అరవింద్ ప్రశంసలు
హైదరాబాద్‌ని ఫిల్మ్ కేపిటల్‌గా చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత కోరిక. ఆ కోరిక నేరవేరుతుందని మనకు అనిపిస్తోంది. ఆ నిర్ణయానికి ఇండస్ట్రీ ఎప్పుడూ తోడుంటుంది. అటువంటి ప్రయత్నాల్లోనే ఇది ఒక చిన్న ప్రయత్నం. ఎందుకంటే, ప్రపంచంలో మూడు బిగ్గెస్ట్ డాల్బీ థియేటర్లు ఉంటే, అందులో ఒకటి హైదరాబాద్‌లో ఉంది. అదే ఇది. ఇలాంటి థియేటర్ మళ్లీ ఇండియాలో రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ స్థలాన్ని కమర్షియల్‌గా ఉపయోగిస్తే కొన్ని కోట్లు సంపాదించవచ్చు. మా నాన్న, నేను, బన్నీ, బన్నీ వాళ్ల అబ్బాయి పుట్టింది ఈ ఇండస్ట్రీలోనే. నాలుగు తరాలుగా ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఉంటూ.., ఈ ఇండస్ట్రీకి ఏదైనా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ థియేటర్ నిర్మించాం. అలాగే నేను రిటైర్ అయిన తర్వాత చూసుకుని గర్వించడానికి ఒక చోటు ఉండాలి కదా అని అనిపించి.. రియల్ ఎస్టేట్‌కు వెళ్లకుండా థియేటర్ నిర్మించాం. దీనికి మా నాన్న ఇలా చేశాడేంటి? అని అనకుండా.. నా కొడుకులందరూ నన్ను ఎంకరేజ్ చేశారు.
సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి
తెలంగాణని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఏక దీక్షతోటి, వారానికి 14 రోజులు పనిచేసే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. ఆయనని ఎక్కువగా మీడియాలో చూస్తుంటాను. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ‘నైకీ’కి ఒక ట్యాగ్‌లైన్ ఉంది.. ‘జస్ట్ డు ఇట్’ అని. ఆయనకు.. ఇది ప్రజలకు, రాష్ట్రానికి ఉపయోగపడుతుందని అనిపిస్తే చాలు.. ఏం ఆలోచించరు.. చేసేయడమే. ఎలాంటి లెక్కలు వేసుకోకుండా.. జస్ట్ డు ఇట్ అంతే. అది నేను నోటీస్ చేశాను. అదే ఈ రోజు మిమ్మల్ని గొప్పవ్యక్తిగా మాట్లాడుకునేలా చేస్తుందని నమ్ముతున్నాను. ఈ జర్నీలో మరో ముగ్గురు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు’’ అని చెబుతూ ఆ ముగ్గురి సీఎం రేవంత్ చేతుల మీదుగా జ్ఞాపికలు అందించారు.
అల్లు అరవింద్ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియజేస్తున్నాయి. హైదరాబాద్‌ను ఫిల్మ్ క్యాపిటల్‌గా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశిద్దాం.


