|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు అర్జున్ చుట్టూ 42 రూల్స్ రచ్చ: నిజమెంత? వైరల్ వీడియోలో షాకింగ్ దృశ్యాలు!

Published: 14-03-2026, 7:05 AM
అల్లు అర్జున్ చుట్టూ 42 రూల్స్ రచ్చ: నిజమెంత? వైరల్ వీడియోలో షాకింగ్ దృశ్యాలు!
  • అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాలన్న కావేరీ బారువా వ్యాఖ్యలు వైరల్.
  • కోకాపేటలో అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అల్లు అర్జున్, స్నేహ రెడ్డి.
  • అల్లు అర్జున్ వెనక్కి తిరిగి చూడటంతో వెనకున్నవారు దూరం పాటించిన వీడియో వైరల్.
  • 42 రూల్స్ నిజమేనని నెటిజన్లు కామెంట్లు, కొందరు ఖండన.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ 42 నిబంధనల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంలో అల్లు అర్జున్ ప్రవర్తనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

అల్లు అర్జున్ 42 నిబంధనల వివాదం మళ్లీ మొదలు

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ కి సంబంధించి ఇటీవల ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అల్లు అర్జున్ ను కలవాలి అంటే 42 నిబంధనలను పాటించాలి అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.

ఇక ఈ విషయం పై టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి ఇక ఈ విషయం కాస్త వివాదంగా మారడంతో చివరికి కావేరి క్షమాపణలు కూడా తెలియజేశారు. ఇంతటితో ఈ వివాదం ముగిసిందని భావించారు కానీ మరోసారి అల్లు అర్జున్ 42 నిబంధనలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ కోకాపేటలో ఏర్పాటు చేసిన అల్లు సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోలలో భాగంగా అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డితో కలిసి అల్లు సినిమాస్ లో సందడి చేశారు. అయితే తన భార్యతో ఈయన కలిసి వెళ్తుండగా తన వెనకే కొంతమంది చాలా దగ్గరగా వచ్చారు అయితే ఒక్కసారిగా అల్లు అర్జున్ వెనక్కి తిరిగి చూడటంతో ఆయన వెనుక వస్తున్న వారందరూ ఆగిపోవడమే కాకుండా అల్లు అర్జున్ దంపతులకు ఏకంగా రెండు అడుగుల దూరం పాటిస్తూ లోపలికి వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్ లు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియోలో అసలు విషయం ఏంటి?

Allu couple at the #AlluCinemas launch. @alluarjun @GeethaArts pic.twitter.com/5C9P2RMnfw

— M9 NEWS (@M9News_) March 12, 2026

నెటిజన్ల కామెంట్లతో దుమారం

అల్లు భాయ్ ఒక్క చూపుతోనే తన నిబంధనలను అమలలోకి తీసుకువచ్చారు అంటూ కామెంట్ లు చేస్తున్నారు. 42 రూల్స్ అబద్ధం కాదని అది నిజమేనని మరికొందరు ఈ వీడియో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ 42 నిబంధనల గురించి గతంలో వార్తలు రాగా ఎంతోమంది ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా స్పందిస్తూ అల్లు అర్జున్ అలాంటి వ్యక్తి కాదని ఆయన అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారని, అతనిని కలవాలి అంటే ఎలాంటి పద్ధతులు పాటించాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే ఈ వివాదం ముగిసిందనుకునేలోపు ఈ వీడియో బయటకు రావడంతో అల్లు అర్జున్ నిబంధనలు నిజమే అంటూ మరోసారి ఈ విషయంపై చర్చలు మొదలయ్యాయి. ఇక అల్లు అర్జున్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన అట్లీ డైరెక్షన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

మొత్తానికి అల్లు అర్జున్ 42 నిబంధనల వ్యవహారం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.