|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allu Arjun : ‘ఐకాన్’ వదిలేసిన అల్లు అర్జున్.. కొత్త హీరోని వెతుక్కుంటారు కానీ వదిలేదే లేదు..

Published: 24-06-2025, 9:42 PM
Allu Arjun : ‘ఐకాన్’ వదిలేసిన అల్లు అర్జున్.. కొత్త హీరోని వెతుక్కుంటారు కానీ వదిలేదే లేదు..

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ‘ఐకాన్’ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ సినిమా ఇప్పుడు కొత్త హీరోతో తెరకెక్కే అవకాశం ఉంది.

Key Points

1

అల్లు అర్జున్ ‘ఐకాన్’ సినిమా నుండి తప్పుకున్నారు.

2

దిల్ రాజు ‘ఐకాన్’ ప్రాజెక్ట్‌ను వదులుకోలేదు.

4

‘ఐకాన్’ టైటిల్ మార్పు, కొత్త హీరో ఎంపిక జరుగుతుందా అన్నది సందిగ్ధంలో ఉంది.

అల్లు అర్జున్ ‘ఐకాన్’ నుండి తప్పుకున్నారా?

Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. భారీ సినిమాలే లైనప్ చేస్తున్నారు. అయితే గతంలో అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఐకాన్ అనే టైటిల్ తో సినిమాని ప్రకటించారు. కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అప్పుడు డైరెక్టర్ వకీల్ సాబ్ తో, అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో సినిమాతో బిజీ అవ్వడంతో ఈ సినిమా పక్కన పెట్టేసారు.

పుష్పతో అల్లు అర్జున్ స్టార్ డమ్ పెరగడంతో ఐకాన్ లాంటి రీజనల్ ప్రాజెక్ట్స్ అసలు ముట్టుకునే ఆలోచనలో కూడా లేరు. దీంతో ఐకాన్ ప్రాజెక్టు ని అల్లు అర్జున్ వదిలేశారని టాలీవుడ్ లో క్లారిటీ వచ్చేసింది. అయితే దిల్ రాజు మాత్రం ఐకాన్ ప్రాజెక్టు ని వదల్లేదు అంట.

దిల్ రాజు ప్రాజెక్ట్‌పై తీసుకున్న నిర్ణయం ఏమిటి?

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.. ఐకాన్ సినిమా ఉంటుంది. కాకపోతే ఇందులో అల్లు అర్జున్ ఉండడు. యాక్షన్ డ్రామాతో పాటు హ్యూమన్ ఎమోషన్స్ తో ఈ కథ ఉంటుంది అని తెలిపారు. దీంతో వేరే హీరోతో ఐకాన్ సినిమా తీస్తారని తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ కాబట్టి మరి ఐకాన్ అనే టైటిల్ వేరే హీరోకి ఇస్తారా అనేది అనుమానమే.

కొత్త హీరో ఎవరు? ‘ఐకాన్’ భవిష్యత్తు ఏమిటి?

ప్రస్తుతం వేణు శ్రీరామ్ నితిన్ తమ్ముడుతో బిజీగా ఉన్నాడు. అది రిలీజయ్యాక ఐకాన్ టైటిల్ మార్చి ఆ సినిమా మీద వర్క్ చేస్తారని తెలుస్తుంది. మరి అల్లు అర్జున్ ఓకే చేసిన కథని ఏ హీరో చేస్తాడో చూడాలి.

చివరగా, అల్లు అర్జున్ ‘ఐకాన్’ ను వదిలినప్పటికీ, దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. కొత్త హీరోతో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Related News

ది ఇండియా స్టోరీ: కాజల్ అగర్వాల్ షాకింగ్ టీజర్.. మనం తినే తిండిలో ఈ విషం ఏంటి? వైబ్రేషన్స్ గ్యారెంటీ!
షారుఖ్ ఖాన్‌కు షాక్! 'నా భర్త కంటే నువ్వే ముద్దు'.. లేడీ ఫ్యాన్ ఓపెన్ ప్రపోజల్! కింగ్ రియాక్షన్ వైరల్!
జీ తెలుగు సరిగమప 2026: ఆడిషన్స్‌కు మాస్ రెస్పాన్స్! బెంగళూరులో ఊహించని ట్విస్ట్!
వైరల్ సంచలనం: త్రిష షాకింగ్ అన్‌ఫాలో! విజయ్ బర్త్‌డే విషెస్ లేవు! భార్యతో మళ్ళీ దగ్గరవుతున్న తలపతి! ఏం జరుగుతోంది?
షాకింగ్ అప్‌డేట్! బాహుబలి టు అవతార్ 3.. ఈ వారం 14 క్రేజీ ఓటీటీ రిలీజ్‌లు.. మిస్సయితే పప్పులో కాలేసినట్టే!
మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ రివ్యూ! సమంత ప్రెగ్నెన్సీ కన్ఫామ్.. టాలీవుడ్‌లో సంచలనం!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.