
📌 Key Points
- దర్శకుడు ఆదిత్య ధర్ మొదట అల్లు అర్జున్‌తో అశ్వద్ధామ కథను తెరకెక్కించాలని అనుకున్నారు.
- నాగ్ అశ్విన్ ‘కల్కి’ సినిమాలో అశ్వద్ధామ పాత్రను చూపించిన విధానం ఆదిత్య ధర్ ప్రాజెక్ట్‌కు అడ్డంకిగా మారింది.
- అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రలో నటించడం సినిమాకు మరింత ప్లస్ అయింది.
- ప్రస్తుతం ఆదిత్య ధర్ ‘ధురంధర్ 2’లో, అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలోని సినిమాలో బిజీగా ఉన్నారు.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో సినిమా తెరకెక్కించాలనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. నాగ్ అశ్విన్ ‘కల్కి’ సినిమాలో అశ్వద్ధామ పాత్రను చూపించిన విధానం ఇందుకు ప్రధాన కారణం.
ఆదిత్య ధర్, అల్లు అర్జున్ కాంబోలో సినిమా?
Allu Arjun– Aditya Dhar : ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ సినిమా ఏ రేంట్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన అల్లు అర్జున్ తో ఓ సినిమా తీయాలనుకున్నారట. అది కూడా అశ్వధ్ధామ కు సంబంధించినది. అయితే ఆ ప్రాజెక్ట్ కు ముందే.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కీ’ వచ్చింది. ఈ సినిమాలో అశ్వధామను నాగ్ అశ్విన్ చూపించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అందులోనూ.. ఆ పాత్రను అమితాబచ్చన్ చేయడంతో మరింత పాపులర్ అయింది. దీంతో ఆదిత్యధర్ అనుకున్న ప్రాజెక్ట్ అక్కడితో ముగిసిపోయింది. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాతో సంచలనం సృష్టించిన ఆదిత్య ధర్, పురాణ గాథలకు ఆధునిక టెక్నాలజీని జోడించి ‘అశ్వత్థామ’ కథను భారీ స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. మొదట విక్కీ కౌశల్ పేరు వినిపించినా, తర్వాత అల్లు అర్జున్‌తో చర్చలు జరిగాయి.
Read also- February OTT Movies : ఫిబ్రవరిలో ఓటీటీలోకి రాబోతున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు..అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..
కల్కి సినిమాతో మారిన సమీకరణాలు
నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 AD’ సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో అశ్వత్థామ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్, విజువల్స్ చూసిన తర్వాత, అదే పాత్రతో మరో సినిమా తీస్తే పోలికలు తప్పవని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఒకే అంశంపై రెండు సినిమాలు రావడం రిస్క్ అని భావించి, అలాగే బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఈ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆదిత్య ధర్ తన తదుపరి చిత్రం ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) పనుల్లో బిజీగా ఉండగా, అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో బిజీ బిజీగా ఉన్నారు. అందుకే ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూసుకుంటే అల్లు అర్జున్ తో సినిమాలు చేయడానికి కోలీవుడ్ దర్శకులే కాకుండా బాలీవుడ్ దర్శకులు కూడా క్యూ కడుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ ను నిలబెట్టిన పుష్ఫ 2 సినిమా ఇటీవలే జపాన్ లో కూడా విడుదలైంది.
ప్రస్తుతం అల్లు అర్జున్, ఆదిత్య ధర్ ఏం చేస్తున్నారు?
Read also- Sobhita dhulipala: అక్కినేని ఫ్యామిలీపై మనసులో మాట బయటపెట్టిన శోభిత?
అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తర్వాత బాలీవుడ్ దర్శకులు కూడా ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నారు.


