
📌 Key Points
- బ్రేకింగ్ న్యూస్: అల్లు అర్జున్, అట్లీ మూవీ టైటిల్ ఫిక్స్! ఏప్రిల్ 8న అఫీషియల్ ఎనౌన్స్మెంట్!!
- బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా, జాన్వీ, మృణాల్, రష్మిక కీలక పాత్రల్లో!
- పుష్ప 2 తర్వాత బన్నీ చేస్తున్న సినిమా ఇది, అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి
- బన్నీ వాసు గుడ్ న్యూస్: ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ కూడా రిలీజ్ కానుంది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇది నిజంగా పండగ లాంటి వార్త. అట్లీ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న సినిమా టైటిల్ ఖరారు అయింది. త్వరలోనే ఫస్ట్ లుక్ కూడా విడుదల కానుంది. ఇక అభిమానులకు పండగే.
టైటిల్ ఫిక్స్ చేసిన బన్నీ వాసు
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి నిర్మాత బన్నీ వాసు అదిరిపోయే శుభవార్త చెప్పారు. పుష్ప 2 లాంటి భారీ విజయం తర్వాత బన్నీ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అయినా టైటిల్, అల్లు అర్జున్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి పవర్ ఫుల్ టైటిల్ అనౌన్స్ చేయబోతున్నట్లు బన్నీ వాసు స్వయంగా వెల్లడించారు.
దీపికా పదుకొణె హీరోయిన్ గా?
తాజాగా ఆయన మలయాళ చిత్రం ‘పళ్లి చట్టంబి’ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. బన్నీ(Allu Arjun) బర్త్‌డే రోజున ఏదైనా గిఫ్ట్ ఉంటుందా అని ఒక రిపోర్టర్ అడిగారు. దానికి సమాధానంగా ఆయన మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రేజీ ప్రాజెక్టు టైటిల్ మాత్రమే కాకుండా, అల్లు అర్జున్ మాస్ లుక్ తో స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఏప్రిల్ 8న ఫస్ట్ లుక్ విడుదల
ప్రస్తుతం ‘AA 22’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలవబడుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా వంటి పాపులర్ హీరోయిన్లు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి అట్లీ మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ఖరారు చేశారో, హీరోయిన్ల విషయంలో ఉన్న సస్పెన్స్ ఏంటో తెలియాలంటే ఏప్రిల్ 8 వరకు ఆగాల్సిందే.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ సినిమా గురించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. ఏప్రిల్ 8న టైటిల్, ఫస్ట్ లుక్ ఎలా ఉంటాయో చూసేద్దాం!


