
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, కనకరత్నమ్మ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషాద ఘటనతో అల్లు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Key Points
అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ కన్నుమూశారు.
అల్లు అర్జున్, రామ్ చరణ్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు.
కోకాపేటలో అంత్యక్రియలు నిర్వహించారు.
అల్లు అర్జున్, అల్లు అయాన్, చిరంజీవి, రామ్ చరణ్ పాడె మోశారు.
కనకరత్నమ్మ కన్నుమూత
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ( Allu Aravind ) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) ఇక లేరు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే ముంబై నుంచి అల్లు అర్జున్, మైసూర్ నుంచి రామ్ చరణ్ హుటాహుటిన హైదరాబాద్ వచ్చేశారు.
ముగిసిన అంత్యక్రియలు నానమ్మ పార్థివదేహాన్ని చూసి అల్లు అర్జున్ ( Allu Arjun ) భావోద్వేగానికి లోనయ్యాడు. పలువురు సినీ ప్రముఖులు అల్లు అరవింద్ నివాసానికి వచ్చి కనకరత్నమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. కాగా కోకాపేటలోని అల్లు వ్యవసాయ క్షేత్రంలో అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు జరిగాయి. అల్లు అర్జున్, అల్లు అయాన్, చిరంజీవి, రామ్‌చరణ్… కనకరత్నమ్మ పాడె మోశారు. అల్లు అరవింద్.. తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
సినీ ప్రముఖుల నివాళులు
అంత్యక్రియలు
అల్లు కుటుంబానికి ఈ విషాదంలో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేశారు. కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.


