
📌 Key Points
- రామ్ చరణ్, ఉపాసనలకు కవల పిల్లలు జననం
- కవలల్లో ఒకరు అబ్బాయి, ఒకరు అమ్మాయి
- అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా అభినందనలు
- మెగా కుటుంబంలో ఆనందకర వాతావరణం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ చేశారు. మెగా అభిమానుల్లో ఆనందం నెలకొంది.
రామ్ చరణ్, ఉపాసనలకు కవలలు
Allu Arjun: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఉపాసన(Upasana) దంపతులకు కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. వీరికి రెండో సంతానంలో భాగంగా జనవరి 31వ తేదీ ఉపాసన ఆడబిడ్డ అలాగే ఒక మగ బిడ్డకు జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో మాత్రమే కాకుండా మెగా అభిమానులలో కూడా ఎంతో సంతోషం నెలకొంది. మెగా వారసుడి కోసం కుటుంబ సభ్యులు మాత్రమే కాదు అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఇలా అభిమానులు ఆశపడినట్టే మెగా మూడోతరం వారసుడు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉపాసన తన ఇద్దరు పిల్లలు కూడా ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్నారని తెలుస్తోంది.
ఈ కవల పిల్లలలో మొదట అబ్బాయి జన్మించారని తర్వాత అమ్మాయి జన్మించారని తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాంచరణ్ ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించడంతో పెద్ద ఎత్తున మెగా కుటుంబ సభ్యుల సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీలు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)రామ్ చరణ్ ఉపాసన దంపతులకు అభినందనలను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
అల్లు అర్జున్ దుబాయ్ నుంచి ఇటీవలే తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన రామ్ చరణ్ ఉపాసనకు కవల పిల్లలు జన్మించడం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..”మరోసారి తల్లిదండ్రులైన రామ్ చరణ్ ఉపాసనకు అభినందనలు. మీరు మరోసారి తల్లిదండ్రులు కావడంతో సంతోషకరమైన వాతావరణం ఏర్పడింది. చిరంజీవి గారు చిట్టిక (సురేఖ) ముఖంలో సంతోషం స్పష్టంగా కనపడుతోందని, ఇలా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండటం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఈ ఇద్దరు చిన్నారులు రాకతో ఈ ప్రపంచంలోకి వస్తూ ఎంతో సంతోషాన్ని తీసుకువచ్చారు. ఈ రెట్టింపు ప్రేమ, ఆనందంతో అందమైన కొత్త ప్రయాణం మొదలైంది అంటూ” అల్లు అర్జున్ రామ్ చరణ్ ఉపాసనలకు అభినందనలు తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
అల్లు అర్జున్ శుభాకాంక్షలు
Congratulations to @AlwaysRamCharan & @upasanakonidela on being wonderful parents once again. Immense joy and celebration all around. The pride and happiness are radiating on @KChiruTweets garu’s face and Chittika’s as well. So happy to see them and the entire family’s smiling…
— Allu Arjun (@alluarjun) February 2, 2026
మెగా అభిమానుల్లో ఆనందం
అల్లు అర్జున్ దుబాయ్ నుంచి ఇటీవల హైదరాబాద్ రావడంతో ఈయన రామ్ చరణ్ పిల్లలను చూడటం కోసం ఇంకా అపోలో హాస్పిటల్ కు వెళ్లకపోయినా సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. ఇక అల్లు శిరీష్ కూడా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా మెగా కుటుంబ సభ్యుల నుంచి ఉపాసన,రామ్ చరణ్ దంపతులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఉపాసన డెలివరీ అయి రెండు రోజుల అయినా ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారని, త్వరలోనే డిశ్చార్జ్ కాబోతున్నారని తెలుస్తోంది.
రామ్ చరణ్, ఉపాసనలకు కవలలు జన్మించడం పట్ల అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు. మెగా కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.


