|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫ్యాన్ కోసం అల్లు అర్జున్ చేసిన పనికి ఫిదా! వేల కి.మీ సైకిల్ యాత్ర, బన్నీ ఆర్థిక సాయం

Published: 16-12-2025, 2:04 AM
ఫ్యాన్ కోసం అల్లు అర్జున్ చేసిన పనికి ఫిదా! వేల కి.మీ సైకిల్ యాత్ర, బన్నీ ఆర్థిక సాయం
  • నార్త్ ఇండియాకు చెందిన అభిమాని అల్లు అర్జున్‌ను కలవడానికి 1758 కి.మీ. సైకిల్‌పై వచ్చారు.
  • అభిమానిని కలిసిన బన్నీ, వారితో ఫోటోలు దిగడమే కాకుండా, వారికి ఆర్థిక సాయం అందించారు.
  • అల్లు అర్జున్ చూపిన ఔదార్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రశంసలు పొందుతోంది.
  • ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రాబోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తన అభిమాని పట్ల చూపిన గొప్ప మనసు అందరినీ ఆకట్టుకుంది. ఆయన్ను కలవడానికి వేల కిలోమీటర్లు సైకిల్‌పై వచ్చిన అభిమానికి బన్నీ కేవలం ఫోటోలతోనే సరిపెట్టకుండా, ఆర్థిక సాయం అందించి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అభిమాని సాహస యాత్ర: వేల కిలోమీటర్లు సైకిల్‌పై

Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. పుష్ప సినిమా ముందు వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగిన బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనివిధంగా నార్త్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఇకపోతే ఇటీవల కాలంలో అభిమానులు తమ అభిమాన హీరోని కలవడం కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ని కలవడం కోసం ఓ అభిమాని ఏకంగా వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ హైదరాబాద్ చేరుకొని తమ అభిమాన హీరోని కలిశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . నార్త్ ఇండియాకు చెందిన ఒక అభిమాని అల్లు అర్జున్ ని కలవడం కోసం ఏకంగా 1,758 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుతూ వచ్చారు. అయితే అల్లు అర్జున్ మాత్రం అభిమానిని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా తనని కలిసి తనతో ఫోటోలు దిగడమే కాకుండా, తనకు ఆర్థికంగా కూడా కొంత సహాయం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బన్నీ ఔదార్యం: ఆర్థిక సాయంతో ఆదుకున్న హీరో

1700 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం చేసి అల్లు అర్జున్ ని కలవడం అంటే ఆయన పట్ల ఏ స్థాయిలో అభిమానం ఉందో స్పష్టమవుతుంది అంటూ బన్నీ ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన అట్లీ సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా బయటకు రాని నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు సినిమా నుంచి అప్డేట్ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.

త్వరలోనే బన్నీ ఫస్ట్ లుక్..

అల్లు అర్జున్ తదుపరి సినిమా అప్డేట్

ఇక అట్లీ సైతం త్వరలోనే ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ కు సంబంధించిన పస్ట్ లుక్, టైటిల్ గ్లింప్ విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. రాజమౌళి వారణాసి సినిమా ఈవెంట్ తరహాలో గ్రాండ్ ఈవెంట్ ద్వారా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ వేడుక మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే, మృణాళ్ ఠాకూర్, రష్మిక, జాన్వీ కపూర్ వంటి తదితరులు నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

అభిమాని పట్ల అల్లు అర్జున్ చూపిన ఈ ప్రేమ, సహాయం సినీ లోకంలో ప్రశంసలు అందుకుంటోంది. స్టార్‌డమ్ వచ్చినా బన్నీ తన అభిమానులను ఎంతగా గౌరవిస్తారో ఈ సంఘటన నిరూపించింది. ఇది నిజంగా అల్లు అర్జున్ ఔదార్యానికి నిదర్శనం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.