|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు అర్జున్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫిక్స్: లోకేష్ కనగరాజ్‌తో బన్నీ భారీ ప్లాన్!

Published: 03-01-2026, 7:30 AM
అల్లు అర్జున్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫిక్స్: లోకేష్ కనగరాజ్‌తో బన్నీ భారీ ప్లాన్!
  • అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
  • లోకేష్ కనగరాజ్‌తో అల్లు అర్జున్ తదుపరి సినిమా ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి, ఇది లోకేష్ డ్రీమ్ ప్రాజెక్ట్.
  • మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, ‘ఇరుంబుకై మాయావి’ కథతో జూలై 2026లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
  • ఈ సినిమాలో అల్లు అర్జున్ కుడి చేయి కోల్పోయి స్టీల్ ప్రోస్థెటిక్‌తో ఉండే విభిన్న పాత్రలో కనిపిస్తారని సమాచారం.

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఇప్పటికే అట్లీ సినిమా షూటింగ్‌లో ఉండగానే, లోకేష్ కనగరాజ్‌తో బన్నీ సినిమా ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ‘ఇరుంబుకై మాయావి’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం లోకేష్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది.

అట్లీ సినిమా షూటింగ్ పురోగతి, అల్లు అర్జున్ పాత్రలు

Allu Arjun New Movie: టాలీవుడ్ , పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం అట్లీ(Atlee) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా పుష్ప 2 సినిమాతో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో ఈయన తదుపరి సినిమాలన్నీ కూడా అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ప్రస్తుతం ఈయన సన్ పిక్చర్ బ్యానర్లో తమిళ దర్శకుడు అట్లీతో కలిసి భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా దాదాపు 50% షూటింగ్ పనులను పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ఇప్పటివరకు అల్లు అర్జున్ నటించని జానర్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో మూడు విభిన్న పాత్రలలో అల్లు అర్జున్ కనిపించబోతున్నట్టు వార్తలు వినిపించాయి. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

లోకేష్ కనగరాజ్‌తో బన్నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫిక్స్

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టులపై కూడా పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఇప్పటికే ఈయన ఐదు సినిమాలను లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది .త్వరలోనే వీటన్నిటికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది. ఇకపోతే గత కొద్దిరోజులుగా అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పటివరకు ఈ సినిమా గురించి సరైన స్పష్టత లేకపోయినా అల్లు అర్జున్ కు లోకేష్ కథ వివరించారని కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ వైరల్ అవుతుంది .లోకేష్ అల్లు అర్జున్ కాంబినేషన్ ఫిక్స్ అయిందని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా జూలై 2026 లోనే సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుస్తోంది. అల్లు అర్జున్ తో లోకేష్ చేయబోయే ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది.” ఇరుంబుకై మాయావి”అనే స్టోరీ నెరేట్ చేయడంతో అల్లు అర్జున్ కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో హీరో తనకుడి చేయిని కోల్పోయి స్టీల్ ప్రోస్థెటిక్ పొందిన వ్యక్తి చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుందని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడించబోతున్నట్లు ఇండస్ట్రీ సమాచారం. ఇక అట్లీ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే బన్నీ లోకేష్ సినిమా పనులలో బిజీ కాబోతున్నట్టు సమాచారం.

సినిమా కథ, నిర్మాణ వివరాలు: జూలై 2026లో షూటింగ్

అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఫిక్స్ కావడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రానున్న ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. బన్నీ ఖాతాలో మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేరినట్టే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.