|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రేకింగ్: లోకేష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూవీ ఖరారు! ఫ్యాన్స్ కి పండగే!!

Published: 14-01-2026, 9:01 AM
బ్రేకింగ్: లోకేష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూవీ ఖరారు! ఫ్యాన్స్ కి పండగే!!
  • అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో AA 23 చిత్రం తెరకెక్కనుంది.
  • ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
  • అనిరుధ్ సంగీతం అందించనుండగా, ఇది 1962 DC కామిక్స్‌ ఆధారంగా రూపొందుతోంది.
  • ఈ ఏడాది చివరి నాటికి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన 23వ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ ప్రకటనతో అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

AA 23: అల్లు అర్జున్, లోకేష్ కాంబో!

AA 23 Announcement Video: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సినిమాల గురించి నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినపడుతూనే ఉంటాయి. ఇలా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఈయన తమిళ దర్శకుడు అట్లీతో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ కు షూటింగ్ పూర్తి అవుతుందని సమాచారం.

ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ సినిమా ఎవరితో ఉండబోతోంది అంటూ ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎక్కువగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)పేరు తెరపైకి వచ్చింది. లోకేష్ అద్భుతమైన కథను నేరేట్ చేయటంతో అల్లు అర్జున్ ఈ సినిమా చేయటానికి సానుకూలంగా స్పందించారని ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాబోతోంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు హల్చల్ చేశాయి. ఇక ఈ వార్తలకు అనుగుణంగా తాజాగా చిత్ర బృందం ఒక వీడియోని విడుదల చేస్తూ అధికారిక ప్రకటన తెలియజేశారు.

భారీ బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం

అల్లు అర్జున్ తన 23వ సినిమాని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలియజేశారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుద్ (Anirudh) సంగీతం అందించబోతున్నట్లు తాజాగా ఒక వీడియో ద్వారా ప్రకటించడంతో అల్లు అర్జున్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇరుంబుకై మాయావి అనే స్టోరీ ద్వారా ఈ సినిమా రాబోతుందని తెలుస్తోంది.

ఈ సినిమా 1962 DC కామిక్ ది స్టీల్ క్లా నుంచి ప్రేరణ పొందిన కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇందులో హీరో కుడిచేయిని కోల్పోయి సూపర్ పవర్స్ ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నారని సమాచారం. ఇలా సూపర్ హీరో కథా నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఈ సినిమా పట్ల ఎంతో ఆత్రుతను కలిగి ఉన్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన రావడమే కాకుండా, ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కాబోతోందనే విషయాన్ని కూడా తెలియచేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఏడాది చివరి నుంచి ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెల్లడి కానున్నాయి.

1962 DC కామిక్స్ నుండి ప్రేరణ పొందిన కథ

అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ ప్రారంభం కానుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.