
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా మలయాళ సెన్సేషనల్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తో కలిసి ఓ కొత్త సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘మల్లు అర్జున్’ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుందని ప్రచారం జరుగుతోంది.
Key Points
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మలయాళ సెన్సేషనల్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తో కొత్త సినిమా
ఈ సినిమా టైటిల్ 'మల్లు అర్జున్' అని ప్రచారం
దీపావళికి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుగనుంది
అల్లు అర్జున్ – బాసిల్ జోసెఫ్ కాంబినేషన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), కోలీవుడ్ స్టార్ హీరో అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నారు. అయితే ఈ సినిమాను సన్ పిక్చర్స్(Sun Pictures) బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone)హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కీలక పాత్రల్లో నటించనున్నట్లు గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కానప్పటికీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీతో పాటు అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ ఈ సినిమా చేయనున్నట్లు టాక్. సడెన్‌గా ఏమైందో తెలియదు కానీ.. ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకోగా.. ఆయన స్థానంలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా, అల్లు అర్జున్ ఓ మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మలయాళ ఇండస్ట్రీలో హీరోగా, సెన్సేషనల్ దర్శకుడిగా ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న బాసిల్ జోసెఫ్(Basil Joseph)తో అల్లు అర్జున్ ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎన్నో హిట్స్ అందుకున్న ఆయన దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా పట్టాలెక్కనున్నట్లు టాక్. ఇక ఈ మూవీ ‘మల్లు అర్జున్’ టైటిల్‌తో రాబోతుందట. బాసిల్ అల్లు అర్జున్‌తో చర్చలు జరపగా కథ విన్న ఆయన ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీపావళికి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రాబోతుందట. దీనిని గీతా అర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ మాత్రం ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది.
‘మల్లు అర్జున్’ సినిమా ప్రకటన
సోషల్ మీడియాలో హాట్ టాపిక్
అల్లు అర్జున్ మరియు బాసిల్ జోసెఫ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీపావళికి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.


