|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు అర్జున్ ‘రాకా’: రమ్యకృష్ణ ఫిక్స్! ఒక్క పోస్ట్‌తో శివగామి షాక్.. బన్నీ మాస్ లుక్ వైరల్!

Published: 08-04-2026, 3:05 PM
అల్లు అర్జున్ 'రాకా': రమ్యకృష్ణ ఫిక్స్! ఒక్క పోస్ట్‌తో శివగామి షాక్.. బన్నీ మాస్ లుక్ వైరల్!
  • అల్లు అర్జున్ ‘రాకా’ ఫస్ట్ లుక్: గుండు లుక్‌లో అల్లు అర్జున్ సంచలనం!
  • రమ్యకృష్ణ ఎంట్రీతో ‘రాకా’ అంచనాలు ఆకాశాన్ని తాకేలా!
  • సన్ పిక్చర్స్ నిర్మాణంలో 800 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘రాకా’!
  • ‘రాకా’ టైటిల్‌తో బన్నీ నెగెటివ్ షేడ్స్ పాత్రలోనా? ఫాంటసీ కథాంశమా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’ మూవీ ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్‌డేట్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. రమ్యకృష్ణ ఎంట్రీతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

గుండు లుక్‌లో అల్లు అర్జున్.. ‘రాకా’ ఫస్ట్ లుక్ అదిరింది!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా టైటిల్ రివీల్ చేసి ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ‘రాకా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుపుతూ అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం విడుదల చేశారు. ఇప్పటివరకు ఉన్న ఊహాగానాలకు తెరదించుతూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో అల్లు అర్జున్ గతంలో ఎన్నడూ కనపడని అనూహ్యమైన రూపంలో దర్శనమిచ్చారు. గుండుతో, ఒంటిపై ప్రత్యేకమైన గుర్తులు, చెవిపోగులతో భిన్నంగా కనిపిస్తున్నారు. ఓ క్రూర మృగం లాంటి చేయి ఆయన ముఖాన్ని కప్పి ఉంచడం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇప్పుడు ఈ అప్డేట్‌తోనే మరో అప్డేట్ కూడా ప్రేక్షకులకు అందింది. ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

అయితే.. దీనిపై ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. కానీ తాజాగా ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చేసింది ఈ సీనియర్ నటి. ఈ మేరకు అల్లు అర్జున్ టైటిల్ పోస్టర్‌ను తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. ‘పరిధులకు అతీతమైన ఒక దృశ్యం కోసం సిద్ధంకండి’ అంటూ క్యాప్షన్ జత చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో.. ఈ సినిమాలో మీరు కూడా భాగం అయినట్లే కదా ఈ పోస్ట్‌తో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా.. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ‘రాకా’ అనే పదానికి రాక్షస శక్తి లేదా క్రూరత్వం అనే అర్థాలు ఉండటంతో, బన్నీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారా? లేక ఇది ఏదైనా సోషియో-ఫాంటసీ కథాంశమా? అంటూ అభిమానులు, నెటిజన్లులలో క్యూరియాసిటీ నెలకొంది.

రమ్యకృష్ణ ఎంట్రీ.. ‘రాకా’కు మరింత క్రేజ్!

800 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ ‘రాకా’!

అల్లు అర్జున్ ‘రాకా’ చిత్రం గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.