
📌 Key Points
- అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
- ఈ చిత్రంలో అల్లు అర్జున్ రూ. 175 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
- దీపికా పదుకొనే రూ. 25 కోట్లు, రష్మిక మందన్న రూ. 5 కోట్లు పారితోషికం అందుకుంటున్నారని వార్తలు.
- ‘పుష్ప 2’ తర్వాత బన్నీ, జవాన్ తర్వాత అట్లీ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రాబోతున్న రాకా మూవీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో అల్లు అర్జున్, ఇతర నటీనటుల రెమ్యూనరేషన్ గురించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాకా మూవీలో అల్లు అర్జున్ లుక్ ఎలా ఉందో తెలుసా?
Raka Movie : టాలీవుడ్ స్టార్ హీరో ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కేవలం పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్లు వర్షం కూడా కురిపించింది. ఇప్పుడు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ మూవీ ఇస్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.. రీసెంట్గా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.. ఆ పోస్టర్లో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ లో కనిపించడంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.. సినిమా ఎలా ఉండబోతుందో అని క్యూరియాసిటీ మొదలైంది.. ఇది ఇలా ఉండగా ఈ మూవీలో నటించబోతున్న హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. మరి ఈ మూవీకి హీరో, హీరోయిన్లకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ వివరాలు
ఐకాన్స్టార్ అల్లు అర్జున్ ఈమధ్య పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.. పుష్ప తర్వాత ఆయన తమిళ డైరెక్టర్ తో సినిమా చేయడంపై ఆ మధ్య గుసగుసలు వినిపించాయి.. రీసెంట్గా హీరో బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన పోస్టర్ టైటిల్ మాత్రం జనాలను బాగా ఆకట్టుకున్నాయి.. చేతికి భారీగా గోర్లు.. చూడడానికి అల్లు అర్జున్ భయంకరంగా కనిపిస్తున్నాడు. చూస్తుంటే ఈ సినిమా మొత్తం భారీ యాక్షన్స్ సన్నివేశాలతో ఉండబోతుంది అని తెలుస్తుంది.. ఇక సినిమా కోసం అల్లు అర్జున్ పెద్ద సాహసమే చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ మూవీకి హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. ఈ మూవీ దాదాపు 700 కోట్లకు పై బడ్జెట్ తో సినిమాకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మిస్తున్నారు.. ఈ మూవీకి గాను అల్లు అర్జున్ దాదాపు 175 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే 25 కోట్లు, రష్మిక కు ఐదు కోట్లు చెల్లిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ రెమ్యూనరేషన్ వివరాలను చిత్రీ యూనిట్ ఎక్కడ పొందుపరచలేదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఇవి ప్రచారంలో ఉన్నాయి..
భారీ బడ్జెట్‌తో రాకా మూవీ నిర్మాణం
అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా అల్లు అర్జున్ 22వ చిత్రమిది. ‘పుష్ప 2’ విజయం తర్వాత బన్నీ, జవాన్ తర్వాత అట్లీ చేస్తున్న మూవీ కావడంతో దీని పై అంచనాలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. నుదిటి మీద గాయాలు ఉన్నాయి. యుద్ధభూమిలో గాయపడిన సింహం శక్తిని పుంజుకుని మళ్ళీ తిరిగి వచ్చినట్టు చూపించారు.. తన ప్రజలకు అండగా నిలిచే ఒక పవర్ఫుల్ పాత్రలో అల్లు అర్జున్ నటించబోతున్నాడు అంటూ పోస్టర్ ని చూస్తే అర్థమవుతుంది.. ఈ టైటిల్ మీనింగ్ ఏమిటి? అనేది చాలా మందికి అర్థం కాలేదు.. ఈ మూవీ గురించి ఇంకాస్త వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.. ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు మాత్రం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు..
మొత్తానికి అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలను కలిగి ఉంది. రెమ్యూనరేషన్ల వివరాలు వైరల్ కావడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.

