|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాపై బన్నీ షాకింగ్ రివ్యూ! రికార్డుల మోత మోగించేలా ఉందంటూ కామెంట్!

Published: 20-01-2026, 5:15 AM
మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాపై బన్నీ షాకింగ్ రివ్యూ! రికార్డుల మోత మోగించేలా ఉందంటూ కామెంట్!
  • మన శంకర వరప్రసాద్ గారు మూవీకి అల్లు అర్జున్ రివ్యూ: బ్లాక్ బస్టర్ హిట్ అని కొనియాడిన బన్నీ!
  • చిరంజీవి వింటేజ్ నటనతో అదరగొట్టారని ప్రశంసించిన అల్లు అర్జున్! స్టెప్పులకు ఫిదా అయ్యానన్న బన్నీ.
  • నయనతార అందంగా ఉందంటూ కామెంట్! వెంకీ మామ పాత్రలో వెంకటేష్ అద్భుతంగా నటించారని ప్రశంసలు!!
  • సంక్రాంతి కానుకగా విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు మూవీ రూ. 300 కోట్ల వసూళ్లు రాబట్టింది!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాపై అల్లు అర్జున్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమా చూసిన తర్వాత బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్దాం!

చిరంజీవి నటనపై అల్లు అర్జున్ ప్రశంసలు!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు ( Mana Shankara Vara Prasad Garu ). అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమా స్పెషల్ షో చూసిన, అల్లు అర్జున్ రివ్యూ ఇచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు బన్నీ. మన శంకర వరప్రసాద్ గారు రియల్ సంక్రాంతిని తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి… వింటేజ్ యాక్టింగ్ తో ఇరగదీసినట్లు ప్రశంసించారు.

రికార్డు కలెక్షన్లు సాధిస్తుందన్న బన్నీ

వెంకీ గౌడ పాత్రలో వెంకీ మామ ఇరగదీసాడని అల్లు అర్జున్ ( Allu Arjun ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాకు అందమైన లుక్ తీసుకువచ్చింది నయనతార గారు అంటూ పొగిడారు. ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వేసిన హుక్ స్టెప్ తనకు బాగా నచ్చిందన్నారు. ఈ సినిమాకు భీమ్స్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ సినిమా చేసిన అనిల్ రావిపూడికి ప్రత్యేక శుభాకాంక్షలు కూడా తెలిపారు అల్లు అర్జున్.

మన శంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు ( Mana Shankara Vara Prasad Garu ) సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి.. రూ.300 కోట్ల వరకు వసూళ్లు రాబడినట్లు చెబుతున్నారు. ఈ సినిమా మరో వారం రోజుల పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కురిపించబోతుందని అంటున్నారు విశ్లేషకులు.

మన శంకర వరప్రసాద్ గారు సినిమా గురించి అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.