|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు శిరీష్ పెళ్లిలో అల్లు అర్జున్ మెరుపులు! డ్రెస్, వాచ్ ధరలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

Published: 02-03-2026, 4:05 AM
అల్లు శిరీష్ పెళ్లిలో అల్లు అర్జున్ మెరుపులు! డ్రెస్, వాచ్ ధరలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
  • అల్లు శిరీష్ పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
  • అల్లు అర్జున్ ధరించిన మెరూన్ రెడ్ కలర్ పైజామా కోటు ధర రూ. 37,500.
  • అల్లు అర్జున్ వాచ్ పటేక్ ఫిలిప్ నాటిలస్ మూన్ స్పేస్ బ్రాండ్ కాగా దాని ధర రూ.2.8 కోట్లు.
  • అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడు అల్లు శిరీష్ పెళ్లి వేడుకలో సందడి చేస్తున్నారు. శిరీష్ పెళ్లి కొడుకు ఫంక్షన్లో అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ధరించిన డ్రెస్, వాచ్ ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అల్లు శిరీష్ పెళ్లిలో అల్లు అర్జున్ సందడి

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఒకవైపు సినిమా పనులలో ఎంతో బిజీగా ఉంటూనే మరోవైపు తన తమ్ముడు అల్లు శిరీష్ పెళ్లి వేడుకలో కూడా సందడి చేస్తున్నారు. అల్లు శిరీష్ పెళ్లి కోసం ఈయన తన సినిమాలకు చిన్న విరామం ప్రకటించారు. ఇప్పటికే అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు మొదలైన సంగతి తెలిసిందే. ఇటీవల శిరీష్ పెళ్లి కొడుకు ఫంక్షన్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెగా, అల్లు కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేశారు. ఇక ఈ పెళ్లి కొడుకు ఫంక్షన్ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జుకాల్కర్ డిజైన్ చేసిన డ్రెస్ ధరించారు. మెరూన్ రెడ్ కలర్ పైజామా కోటు ధరించి అల్లు అర్జున్ మరింత స్టైలిష్ లుక్ లో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు అర్జున్ ధరించిన ఈ డ్రెస్, అతని చేతి వాచి పై అందరి దృష్టిపడింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ నటించిన ఈ డ్రెస్ వాచ్ ఖరీదు ఎంత అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

అల్లు అర్జున్ ధరించిన డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

అల్లు అర్జున్ డ్రెస్ విషయానికి వస్తే ఈ డ్రెస్ ను ప్రముఖ డిజైనర్ జుకాల్కర్  డిజైన్ చేశారు. ఈ డ్రెస్ ఖరీదు రూ. 37,500 అని తెలుస్తుంది. ఇక ఈ వేడుకలో భాగంగా శిరీష్ ధరించిన చేతి వాచ్ విషయానికి వస్తే.. చేతి వాచ్ పటేక్ ఫిలిప్ నాటిలస్ మూన్ స్పేస్ బ్రాండ్ కు చెందిన వాచ్ ధరించారు. ఈ వాచ్ ఖరీదు అక్షరాలా రూ.28,240,650 అని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇలా ఒక్క వాచ్ కోసం లక్షలు ఖర్చు చేయడం తెలిసిన అభిమానులు భాయ్ చాలా కాస్ట్లీ గురూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు ఈ డబ్బుతో ఒక మధ్యతరగతి కుటుంబం జీవితాంతం హ్యాపీగా బ్రతికేయొచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్..

కోట్ల విలువ చేసే వాచ్ ధరించిన అల్లు అర్జున్

ఇలా సెలబ్రిటీలు ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించడం సర్వసాధారణమైనప్పటికీ సామాన్యులకు మాత్రం వింతగా ఉంటుందని చెప్పాలి. సెలబ్రిటీలు వేసుకునే చెప్పుల నుంచి మొదలుకొని తిరిగే కార్లు ఉండే బంగ్లాలు కూడా ఇలా ఖరీదైనవే ఉంటాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ స్టైలిష్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అల్లుడు శిరీష్ పెళ్లి విషయానికి వస్తే ఈరోజు సాయంత్రం సినీ సెలెబ్రెటీలతో గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. ఇక వీరి వివాహం మార్చి 6వ తేదీ అల్లు స్టూడియోస్ లో జరగబోతోందని తెలుస్తుంది.

మొత్తానికి అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ్ముడి పెళ్లి వేడుకలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలవడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.