📌 Key Points
- అల్లు అర్జున్‌ను కలవడానికి 42 నిబంధనలు అంటూ వీడియో వైరల్
- అల్లు అర్జున్ మనలాంటి మనిషి కాదా అని నెటిజన్ల ప్రశ్నలు
- ఆరోపణలను ఖండిస్తూ అల్లు అర్జున్ టీమ్ ప్రకటన విడుదల
- తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాలా అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ టీమ్ వెంటనే స్పందించి ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది.
వైరల్ అవుతున్న 42 నిబంధనల వీడియో
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు సంబంధించి సోషల్ మీడియాలో ‘ప్రోటోకాల్’ అంటూ ఓ వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌ని కలవడానికి పాటించాల్సిన 42 కఠిన నిబంధనలు అంటూ ఓ వీడియా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అందులో మీడియా ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్స్ కోసం సిద్ధం చేసినట్లుగా చెబుతున్న ఓ ‘ప్రోటోకాల్’ (Allu Arjun Protocol) గురించి మాట్లాడుతున్నారు. ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి.. అల్లు అర్జున్ మనలాంటి మనిషి కాదా అని నెటిజన్లు కౌంటర్స్ వేస్తున్నారు. ఇదే విషయంపై వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఒక్కసారిగా అల్లు అర్జున్‌పై ఇలాంటి ఆరోపణలు వ్యాపించడంతో.. వెంటనే ఆయన టీమ్ రియాక్టైంది. ఈ మేరకు వారు ఘాటుగా ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇందులో..
నెటిజన్ల నుండి వస్తున్న కౌంటర్లు
‘‘తాజాగా అల్లు అర్జున్‌పై వస్తున్న కొన్ని వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి, అవన్నీ పూర్తిగా అవాస్తవం. ఆయన ఎప్పుడూ అత్యంత హుందాతోనూ, అందరి పట్ల గౌరవప్రదంగానే నడుచుకున్నారు. ఈ తప్పుడు ఆరోపణలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. వీటికి బాధ్యులైన వారిపై మా లీగల్ టీమ్ డెఫమేషన్ దావా వేయడానికి సిద్ధమవుతోంది. నిజానిజాలు తెలుసుకోకుండా దయచేసి ఎటువంటి సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని అందరినీ కోరుతున్నాము’’ అని అల్లు అర్జున్ టీమ్ (Allu Arjun Team) అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మరి ఈ ప్రకటనతో అయినా ఈ వార్తలు ఆగుతాయేమో చూడాలి. మాములుగా అయితే అల్లు అర్జున్ గురించి టాలీవుడ్‌లోని అందరికీ తెలుసు. అందరితో బన్నీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారని. రీసెంట్‌గానే ఫ్యాన్స్‌తో కూడా ఆయన సమావేశమయ్యారు. ఎక్కడా ఇలాంటి నిబంధనలు వినిపించలేదు. కానీ, బాలీవుడ్‌లో బన్నీని టార్గెట్ చేసినట్లుగా, ఇప్పుడో పాడ్‌కాస్ట్ వీడియో వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్ టీమ్ ఘాటు రియాక్షన్
రాయల్ ఎన్‌ఫీల్డ్ మాజీ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బారువా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌పై షాకింగ్ ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అల్లు అర్జున్‌ను కలిసే ముందు తన బృందానికి 42 నిబంధనలతో కూడిన ఒక జాబితాను అందించాలని ఆమె అంటున్నారు. అంతేకాదు, ఆయనకు మేనేజర్ తర్వాత మేనేజర్, మరో మేనేజర్ ఇలా ఉంటారని, వారందరినీ దాటుకుని వెళ్లాలని తెలిపారు. ఇంకా ఆమె చెప్పిన వాటిలో అల్లు అర్జున్ కళ్ళలోకి నేరుగా చూడకూడదు, ఆయనతో కరచాలనం చేయకూడదు వంటి ఆంక్షలు కూడా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇలా దాదాపు 42 నిబంధనలు దాటుకుని అల్లు అర్జున్‌తో ఫొటో షూట్ చేయాల్సి ఉంటుందని ఈ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు. అంతే ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చినప్పటి నుంచి అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ వైరల్ చేస్తూ రకరకాలుగా వార్తలను క్రియేట్ చేస్తున్నారు. ఈ వార్తలపై వివరణ ఇస్తూ.. అల్లు అర్జున్ టీమ్ పై విధంగా పేర్కొంది.
అల్లు అర్జున్ టీమ్ విడుదల చేసిన ప్రకటనతో ఈ వివాదానికి తెరపడుతుందో లేదో చూడాలి. ఆయన అందరితో స్నేహపూర్వకంగా ఉంటారని చాలామంది చెబుతున్నారు. ఈ ఆరోపణల వెనుక ఎవరున్నారో తెలియాల్సి ఉంది.


