|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బన్నీ బర్త్‌డే స్పెషల్: టాప్ 10 మూవీస్ లిస్ట్ రిలీజ్! పుష్ప 2కి షాకింగ్ ట్విస్ట్!!

Published: 06-04-2026, 11:35 PM
బన్నీ బర్త్‌డే స్పెషల్: టాప్ 10 మూవీస్ లిస్ట్ రిలీజ్! పుష్ప 2కి షాకింగ్ ట్విస్ట్!!
  • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా టాప్ 10 మూవీస్ లిస్ట్ విడుదల!
  • ఐఎండీబీ రేటింగ్ ప్రకారం బన్నీ కెరీర్ లోనే ‘వేదం’ మూవీకి అత్యధిక రేటింగ్ – 8.1!
  • సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్య’ మూవీ బన్నీకి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
  • ‘పుష్ప 2’ టాప్ 10 లిస్టులో లేకపోవడం అభిమానులకు షాకింగ్ న్యూస్ – అసలు కారణం అదేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన 44వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కెరీర్‌లోని టాప్ 10 మూవీస్ లిస్ట్ వైరల్ అవుతోంది. అందులో ‘పుష్ప 2’ లేకపోవడం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

బన్నీ కెరీర్‌ను మార్చిన టాప్ మూవీస్ ఏవి?

అల్లు అర్జున్‌ ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌. అయితే `పుష్ప` సినిమాలతో పాన్‌ ఇండియా హీరోగా ఎదిగారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరిగా రాణిస్తున్నారు. ఒకే సినిమాతో ఆయన రేంజ్‌ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఇండియన్‌ సినిమాలో అత్యంత ఫాలోయింగ్‌ ఉన్న హీరోగా రాణిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్‌ మార్కెట్‌పై కన్నేశారు. రాబోయే సినిమాలతో ఆయన అంతర్జాతీయ నటుడిగా నిరూపించుకునే పనిలో ఉన్నారు. అయితే రేపు బుధవారం(ఏప్రిల్‌ 8న) బన్నీ తన 44వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఐఎండీబీ రేటింగ్‌ ప్రకారం ఆయన నటించిన బెస్ట్ టాప్‌ 10 మూవీస్‌ ఏంటో చూస్తే, ఇందులో ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేసిన `పుష్ప 2` అసలు టాప్‌ 10లోనే లేకపోవడం గమనార్హం.

ఐఎండీబీ రేటింగ్‌ ప్రకారం అల్లు అర్జున్‌ నటించిన చిత్రాల్లో టాప్‌లో ఉన్న మూవీ `వేదం`. అనుష్క, మంచు మనోజ్‌ కలిసి నటించారు. ఇది ఐదుగురు విభిన్న నేపథ్యాలకు చెందిన వ్యక్తుల కథలను చెబుతుంది. విమర్శల ప్రశంసలందుకున్న ఈ మూవీలో 8.1 రేటింగ్‌తో టాప్‌లో ఉంది. ఇది పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. నటుడిగా బన్నీకి మంచి పేరుని తీసుకొచ్చిన చిత్రమిదే అని చెప్పొచ్చు. దీనికి క్రిష్‌ (రాధాకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వం వహించారు. ఇది 2010లో విడుదలైంది.

ఇది అల్లు అర్జున్‌ లైఫ్‌నే మార్చేసిన మూవీ. హీరోగా ఎంట్రీ ఇచ్చిన `గంగోత్రి` పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచించి, టైమ్‌ తీసుకుని ఈ సినిమాని చేశాడు బన్నీ. దర్శకుడు సుకుమార్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు. ఈ మూవీ ఇండిస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. లవ్‌ స్టోరీస్‌లో ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. సుకుమార్‌ దర్శకత్వం వహించగా, ఇందులో బన్నీకి జోడీగా అనురాధ మెహతా, కీలక పాత్రలో శివ బాలాజీ నటించారు. ఇది 2004లో విడుదలైంది. దీనికి ఐఎండీబీ 7.8 రేటింగ్‌ ఇచ్చింది.

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించిన చిత్రమిది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీతోనే బన్నీ పాన్‌ ఇండియా హీరోగా అవతరించారు. ఇది పెద్ద హిట్‌ అయ్యింది. సమంత పాట ఊపేసింది. దీనికి ఐఎండీబీ 7.6 రేటింగ్‌ ఇచ్చింది.

పుష్ప 2 ఐఎండీబీ రేటింగ్ ఎందుకు తక్కువ?

`ఆర్య` మూవీ సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా 2009లో `ఆర్య 2`ని రూపొందించారు దర్శకుడు సుకుమార్‌. అల్లు అర్జున్‌, కాజల్‌, నవదీప్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయింది. ఇందులో బన్నీ నటన అందరిని మెప్పిస్తుంది. దీనికి ఐఎండీబీ 7.5 రేటింగ్‌ ఇచ్చింది.

అల్లు అర్జున్‌ని కొత్త కోణంలో చూపించే మూవీ `జులాయి`. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ రూపొందించిన చిత్రమిది. ఇద్దరు అత్యంత తెలివైన వారి మధ్య సాగే ఘర్షణ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో ఇలియానా హీరోయిన్‌గా నటించింది. కామెడీ, యాక్షన్‌, డ్రామా ప్రధానంగా సాగే ఈ మూవీ 2012లో విడుదలై పెద్ద హిట్‌ అయ్యింది. ఈ మూవీలో బన్నీ నటన మెప్పిస్తుంది. దీనికి ఐఎండీబీ 7.3 రేటింగ్‌ ఇచ్చింది.

సురేందర్‌ రెడ్డి రూపొందించిన `రేసుగుర్రం` చిత్రంలో అల్లు అర్జున్‌, శ్రుతి హాసన్‌ జంటగా నటించగా, శ్యామ్‌ కీలక పాత్ర పోషించారు. ఇద్దరు అన్నదమ్ములు, రెండు వేర్వేరు దారులు. కానీ ఇద్దరు ఒకరికోసం ఒకరు పోరాడుతుంటారు. ఆద్యంతం ఫ్యామిలీ యాక్షన్‌ డ్రామాగా సాగే ఈ మూవీ 2014లో విడుదలై బాక్సాఫీసుని షేక్‌ చేసింది. దీనికి ఐఎండీబీ 7.3 రేటింగ్‌ ఇచ్చింది.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రమిది. సుశాంత్‌, టబు కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఫ్యామిలీ డ్రామా ప్రధానంగా రూపొందింది. 2020లో విడుదలైంది. అప్పట్లో నాన్‌ బాహుబలి రికార్డులను బ్రేక్‌ చేసింది. ఇందులో బన్నీ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా కనిపిస్తూ సెటిల్డ్ యాక్టింగ్‌తో ఇరగదీశాడు. సినిమా బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. దీనికి ఐఎండీబీ రేటింగ్‌ 7.3 ఇచ్చింది.

అల్లు అర్జున్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి?

అల్లు అర్జున్‌, జెనీలియా జంటగా నటించిన `హ్యాపీ` మూవీ ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగుతుంది. ఇందులో బన్నీని మరో యాంగిల్‌లో చూడొచ్చు. ఈ సినిమా ఆడలేదు, కానీ క్రిటిక్స్ నుంచి ప్రశంసలందుకుంది. ఏ కరుణాకరన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2006లో విడుదలైంది. దీనికి ఐఎండీబీ 7.1 రేటింగ్‌ ఇచ్చింది.

అల్లు అర్జున్‌, శీలా కౌర్‌ జంటగా నటించిన ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించారు. ఒక విలన్‌ కూతురుని వెతికే నేపథ్యంలో ఆయన చిన్న కూతురుతో హీరో ప్రేమలో పడటం ఈ మూవీ స్టోరీ. క్రేజీగా సాగే ఈ మూవీ 2008లో విడుదలై బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. దీనికి ఐఎండీబీ 7.1 రేటింగ్‌ ఇచ్చింది.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రమిది. అల్లు అర్జున్‌, సమంత, నిత్యా మీనన్‌ నటించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. తండ్రి సెంటిమెంట్‌తో సాగుతుంది. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. దీనికి ఐఎండీబీ 7.1 రేటింగ్‌ ఇచ్చింది.

ఇదిలా ఉంటే ఈ లిస్ట్ లో `పుష్ప 2` లేకపోవడం గమనార్హం. `పుష్ప 2` ఏకంగా బాక్సాఫీసు వద్ద రూ.1700కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. బన్నీని పాన్‌ ఇండియా హీరోని చేసింది. ఈ సినిమాలోని ఆయన నటనకు విశేష ప్రశంసలు దక్కాయి. కానీ ఐఎండీబీ టాప్‌ 10లో చోటు దక్కించుకోలేకపోయింది. దీనికి ఇది 6.1 రేటింగ్‌ మాత్రమే ఇవ్వడం గమనార్హం.

అల్లు అర్జున్ టాప్ మూవీస్ లిస్ట్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ‘పుష్ప 2’ లేకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.