
మెగాస్టార్ చిరంజీవి ‘స్టేట్ రౌడీ’ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమా గురించి అల్లు రామలింగయ్య చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు మరియు చిరంజీవి రియాక్షన్ గురించి ఈ కథనం వివరిస్తుంది.
Key Points
అల్లు రామలింగయ్య 'స్టేట్ రౌడీ' ఫ్లాప్ అని అన్నారు.
చిరంజీవి తన మామయ్య వ్యాఖ్యలకు ఆశ్చర్యపోయారు.
'స్టేట్ రౌడీ' తొలి వారంలో ఫ్లాప్ టాక్ వచ్చినా, తర్వాత బ్లాక్ బస్టర్ అయింది.
ఈ సినిమా విజయం తర్వాతే చిరంజీవిని బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ తో పోల్చింది.
స్టేట్ రౌడీ విజయం
అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద చేసిన సౌండ్ బాలీవుడ్ వరకు వినిపించేది. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి చిత్రాలతో చిరంజీవి అమితాబచ్చన్ కి కాంపిటీషన్ గా మారారు అంటూ అప్పట్లో పలు మ్యాగజైన్లు కథనాలు ప్రచురించేవి. బాలీవుడ్ వాళ్లు చిరంజీవి గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టింది స్టేట్ రౌడీ చిత్రం నుంచే. బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన స్టేట్ రౌడీ చిత్రం 1989లో వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.
ఈ చిత్రం లో భానుప్రియ, రాధా హీరోయిన్లుగా నటించారు. టి సుబ్బిరామిరెడ్డి, శశిభూషణ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం రిలీజ్ అయిన వెంటనే చిరంజీవి తన తదుపరి చిత్రం కొండవీటి దొంగ షూటింగ్ తో బిజీ అయిపోయారు. కొండవీటి దొంగ షూటింగ్ తలకోనలో జరుగుతోంది. ఆ సమయంలో అల్లు రామలింగయ్య స్టేట్ రౌడీ మూవీ గురించి చేసిన వ్యాఖ్యలను పరుచూరి గోపాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
అల్లు రామలింగయ్య వ్యాఖ్యలు
అప్పటికి స్టేట్ రౌడీ మూవీ రిలీజై వారం మాత్రమే అయింది. అల్లు రామలింగయ్య కొండవీటి దొంగ షూటింగ్ కి రాగానే స్టేట్ రౌడీ పోయింది.. స్టేట్ రౌడీ మూవీ ప్లాప్ అని అంటూ వచ్చారు. మావయ్య ఏంటి ఇలా అంటున్నారు అని చిరంజీవి ఆశ్చర్యానికి గురయ్యారు. చిరంజీవితో పాటు తాము ఆశ్చర్యపోయినట్లు పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. వెంటనే నిర్మాత శిశు భూషణ్ అక్కడికి వచ్చారు. స్టేట్ రౌడీ మూవీ బ్లాక్ బస్టర్ దిశగా వెళుతోంది అంటూ ఆయన చిరంజీవికి కలెక్షన్ల వివరాలు చెప్పారట.
దీంతో చిరంజీవి మామయ్య అల్లు రామలింగయ్య వంక అదోలా చూస్తూ ఫ్లాప్ అని చెప్పారు మీకు అనేలా రియాక్షన్ ఇచ్చారు. పక్కన ఉన్న వాళ్లు కూడా మీకు ఈ సినిమా ఫ్లాప్ అని ఎవరు చెప్పారు అని అల్లు రామలింగయ్యని ప్రశ్నించారట. అల్లు రామలింగయ్య బదులిస్తూ.. ఏమో నాకేం తెలుసు అందరూ ఫ్లాప్ అంటున్నారు నేను కూడా అన్నాను అని అన్నారట.
చిరంజీవి ప్రతిస్పందన
వాస్తవానికి స్టేట్ రౌడీ చిత్రానికి తొలి వారం ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం రికార్డులు సృష్టించింది. రెండో వారం నుంచి ఫ్లాప్ టాక్ పూర్తిగా పోయి సినిమా సూపర్ హిట్ అయింది అని పరుచూరి తెలిపారు. స్టేట్ రౌడీ మూవీ వసూళ్లు చూసి బాలీవుడ్ వాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పటి నుంచే చిరంజీవిని అమితాబచ్చన్ తో పోల్చడం మొదలుపెట్టారు. ఏడాది పాటు ఆడిన వెంకటేష్ బొబ్బిలి రాజా చిత్రానికి కూడా తొలి వారం ఫ్లాప్ టాక్ వచ్చిందని పరుచూరి తెలిపారు.
చివరగా, ‘స్టేట్ రౌడీ’ సినిమా విజయం చిరంజీవి కెరీర్ లో ఒక మలుపు. అల్లు రామలింగయ్య వ్యాఖ్యలు, చిరంజీవి ప్రతిస్పందన ఈ విజయానికి మరింత ఆసక్తిని కలిగించాయి.


