
📌 Key Points
- అల్లు శిరీష్ బాల నటుడిగా చిరంజీవి నటించిన ‘ప్రతి బంద్’ సినిమాలో నటించారు.
- అమీర్ ఖాన్ నటించిన ‘గజిని’ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా, శిరీష్ సహ నిర్మాతగా వ్యవహరించారు.
- శిరీష్ నటించిన ‘బడ్డీ’ సినిమా 2024లో విడుదలై నిరాశపరిచింది.
- నైనిక రెడ్డితో శిరీష్ వివాహం మార్చి 6న జరగనుంది, నేడు రిసెప్షన్ వేడుక.
టాలీవుడ్ లో అల్లు కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. అల్లు శిరీష్ బాల నటుడిగా బాలీవుడ్ లో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగులో హీరోగా పరిచయమయ్యారు. ప్రస్తుతం ఆయన నైనిక రెడ్డిని వివాహం చేసుకోనున్నారు.
బాలీవుడ్ లో అల్లు శిరీష్ తొలి అడుగులు
Allu Sirish: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అల్లు కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇప్పటికే అల్లు వారసుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక అల్లు వారసుడిగా శిరీష్ సైతం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈయన గౌరవం అనే సినిమా ద్వారా హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఇలా పలు సినిమాల ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిరీష్ పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు.
ఇలా గౌరవం సినిమా ద్వారా శిరీష్ హీరోగా పరిచయమయ్యారనే విషయం అందరికీ తెలుసు కానీ ఈ సినిమా కంటే ముందుగా ఈయన బాలీవుడ్ సినిమాలలో నటించారని తెలుస్తోంది. అల్లు శిరీష్ గౌరవం సినిమాలో నటించడానికి కంటే ముందుగానే ఈయన బాలీవుడ్ సినిమాలలో పనిచేశారు. శిరీష్ మూడు సంవత్సరాల వయసులో ఉన్న సమయంలోనే చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన ప్రతి బంద్(Pratibandh) అనే సినిమాలో బాల నటుడిగా నటించారు. ఈ సినిమా బాలీవుడ్ సినిమా కావటం విశేషం అదే విధంగా అమీర్ ఖాన్ హీరోగా నటించిన సూపర్ సక్సెస్ అందుకున్న గజిని సినిమా(Gajini) కోసం కూడా శిరీష్ పని చేశారని తెలుస్తుంది.
‘గజిని’ సినిమాకు సహ నిర్మాతగా శిరీష్
మురగదాస్ దర్శకత్వంలో సూర్య , నయనతార ఆసిన్ ప్రధాన పాత్రలలో నటించిన గజిని సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీమేక్ చేశారు ఈ సినిమాలో అమీర్ ఖాన్ నటించగా, ఈ చిత్రానికి గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించగా అల్లు శిరీష్ సహనిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా శిరీష్ తెలియజేశారు. ఇలా తెలుగులో గౌరవం అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ముందే బాలీవుడ్ సినిమాల కోసం పనిచేశారనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
నేడు శిరీష్ నైనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్..
త్వరలో నైనిక రెడ్డితో వివాహం
ఇక ఈయన సహ నిర్మాతగా వ్యవహరించిన గజని సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక అల్లు శిరీష్ తెలుగులో పలు సినిమాలలో నటించినా అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం రాలేకపోయింది. ఈయన 2024లో బడ్డీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శిరీష్ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈయన నైనిక రెడ్డి అనే అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నారు వీరి వివాహం మార్చి 6న ఎంతో ఘనంగా జరగబోతుంది. ఇక నేడు సాయంత్రం వీరి వివాహ రిసెప్షన్ వేడుక జరగబోతోంది ఈ కార్యక్రమంలో భాగంగా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు హాజరుకానున్నారు.
అల్లు శిరీష్ సినీ జీవితం ఆరంభంలో బాలీవుడ్ తో ముడిపడి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. త్వరలో ఆయన నైనిక రెడ్డిని వివాహం చేసుకోనున్నారు. వారి వివాహానికి సంబంధించిన వేడుకలు జరుగుతున్నాయి.


