|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allu Sirish: పదేళ్ల నుంచి పెళ్లి చేసుకోమంటున్నారు కానీ.. అల్లు వారసుడు షాకింగ్ కామెంట్స్

Published: 09-05-2025, 9:37 AM
Allu Sirish: పదేళ్ల నుంచి పెళ్లి చేసుకోమంటున్నారు కానీ.. అల్లు వారసుడు షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ తాజాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

Key Points

1

అల్లు శిరీష్ పెళ్లి గురించి బయటవారు ఎక్కువగా ప్రశ్నిస్తున్నారని వెల్లడించారు.

2

పదేళ్లుగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని ప్రశ్నిస్తున్నారని తెలిపారు.

4

యాంకర్ సుమతో జరిగిన ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అల్లు శిరీష్‌ కామెంట్స్ వైరల్

టాలీవుడ్ ప్రముఖ హీరో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. రాధామోహన్ దర్శకత్వం వహించిన గౌరవం సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ఈ నటుడు. ఇక బాలనటుడిగా శిరీష్ భానుమతి దర్శకత్వంలో వచ్చిన తమిళ సీరియల్‌లో కూడా నటించి మెప్పించాడు. తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, 197: బియాండ్ బోర్డర్స్, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఈర్వశివో రాక్షసివో, బడ్డీ వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇకపొతే ఈ నటుడు తాజాగా చేసిన పలు కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పెళ్లి ప్రశ్నలకు ఆయన సమాధానం

సింగిల్స్ సినిమా బృందం ఫన్ బ్లాసట్ అంటూ కొంతమంది టాలీవుడ్ సింగిల్స్‌ను గెస్ట్‌లుగా పిలిచి ఫన్సీ కామెంట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో అల్లు శిరీష్ కార్యక్రమంలో మెరిశారు. ఇక టాలీవుడ్ ప్రముఖ యాంకర్ వొచ్చి అల్లు శిరీష్ పెళ్లి మీద ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై శిరీష్ స్పందించి.. అమ్మనాన్నల కంటే బయటవాళ్లే నా పళ్లి గురించి ఎక్కువగా అడుగుతున్నారు. పదేళ్లుగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని ప్రశ్నిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు.

సుమతో ఫన్నీ సంభాషణ

కానీ సింగిల్ లైఫే బెస్ట్ అన్నట్లుగా శిరీష్ మాట్లాడారు. అల్లు అర్జున్ వివాహం చేసుకుని హాయిగా ఉన్నాడుగా అని యాంకర్ సుమ అనగా.. నేను కూడా సింగిల్‌గా ఉండి చాలా సంతోసంగా ఉన్నాగా అని శిరీష్ రివర్స్ పంచ్ విసిరాడు. దీంతో సుమ సారీ అరవింద్ గారు పదేళ్ల నుంచి మీవల్లే కాలేదు.. ఇక ఒక్క కార్యక్రమంలో నావల్లేమవుద్ధి అంటూ అని సుమ కూడా చేతులెత్తేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అల్లు శిరీష్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తన సింగిల్ లైఫ్‌ను ఆయన ఎంతగానో ఆస్వాదిస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.