|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

15 మంది పురుషులతో 20 రోజుల పాటు బట్టలు లేకుండా న్యూడ్‌గా ఉన్నాను.. రామ్ చరణ్ బ్యూటీ సంచలన కామెంట్స్

Published: 16-06-2025, 1:44 AM
15 మంది పురుషులతో 20 రోజుల పాటు బట్టలు లేకుండా న్యూడ్‌గా ఉన్నాను.. రామ్ చరణ్ బ్యూటీ సంచలన కామెంట్స్

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రసిద్ధ నటి అమలాపాల్ తన ‘ఆమె’ సినిమాలోని న్యూడ్ సన్నివేశాల షూటింగ్ గురించి సంచలన విషయాలను వెల్లడించింది. 15 మంది పురుషుల ముందు 20 రోజులు…

Key Points

1

అమలాపాల్ ‘ఆమె’ సినిమాలో నగ్నంగా నటించింది.

2

15 మంది పురుషుల సమక్షంలో 20 రోజులు న్యూడ్ సన్నివేశాలు చిత్రీకరించబడ్డాయి.

4

ఆర్థిక సమస్యల వల్ల సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలిపింది.

అమలాపాల్‌ సంచలన వ్యాఖ్యలు

‘మైనా’(Maina) మూవీతో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన అమలాపాల్(Amalapaul) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలో తన నటనతో తమిళనాడు రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది. ఇక తెలుగులో ‘ఇద్దరమ్మాయిలతో’(Iddarammayilatho) సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయి ఆ తర్వాత రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘నాయక్’(Nayak) మూవీతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది.

‘ఆమె’ సినిమా షూటింగ్ అనుభవం

ఇదిలా ఉంటే అమలాపాల్ నటించిన ‘ఆమె’(Ame) సినిమా ఎంతగా విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. తమిళ్‌లో ‘ఆడై’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ నగ్నంగా నటించి మెప్పించింది. అయితే న్యూడ్ సన్నివేశంలో నటించిన విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘ నేను నగ్నంగా నటించే సన్నివేశాన్ని 15 మంది పురుషుల సమక్షంలో షూట్ చేశారు.

ఆర్థిక ఇబ్బందులు, సినిమా విడుదల

అది నాకు సవాలుగా అనిపించినప్పటికీ, సినిమాలో పాత్రకు న్యాయం చేయడానికి ఆ సన్నివేశంలో నటించాను. ఈ సీన్ కోసం నేను దాదాపు 20 రోజుల పాటు న్యూడ్‌గా నటించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియలో చాలా ఇబ్బందులు పడ్డాను. అయితే ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నప్పుడు ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ఇది ఇంకొంత బాధను కలిగించింది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమలాపాల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అమలాపాల్‌ ‘ఆమె’ సినిమా షూటింగ్‌లోని కష్టాలను, ఆర్థిక సమస్యలను వెల్లడించింది. ఆమె ధైర్యసాహసాలకు ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.