|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘అమ‌రావ‌తికి ఆహ్వానం’ మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి

Published: 17-05-2025, 11:40 AM
'అమ‌రావ‌తికి ఆహ్వానం' మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి

‘అమరావతికి ఆహ్వానం’ అనే హారర్ థ్రిల్లర్ చిత్రం మధ్యప్రదేశ్‌లోని అందమైన ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసింది. శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.

Key Points

1

'అమరావతికి ఆహ్వానం' చిత్రం మధ్యప్రదేశ్ షెడ్యూల్ పూర్తి చేసింది.

2

శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

4

టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది.

మధ్యప్రదేశ్ షూటింగ్ పూర్తి

తెలుగులో తీస్తున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ‘అమ‌రావ‌తికి ఆహ్వానం’. శివ కంఠంనేని, ఎస్త‌ర్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌, సుప్రీత‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జివికె దర్శకత్వం వహిస్తున్నారు. కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల‌ విడుద‌లైన టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ తాజాగా మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ కంప్లీట్ చేసింది.

మ‌ధ్య ప్రదేశ్ చింద్వార జిల్లాలోని తామ్య హిల్స్‌, పాతాళ్ కోట్‌, బిజోరి, చిమ్‌తీపూర్ లాంటి ప‌లు అంద‌మైన లొకేష‌న్స్‌లో దాదాపు 20 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రిపారు. హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ.. అమ‌రావ‌తికి ఆహ్వానం టైటిల్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నాం. ఔట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది ‍అని చెప్పుకొచ్చారు.

నటీనటులు మరియు సినిమా వివరాలు

స్పందన మరియు భవిష్యత్ ప్రణాళికలు

మధ్యప్రదేశ్ షెడ్యూల్ పూర్తి కావడంతో ‘అమరావతికి ఆహ్వానం’ చిత్రం నిర్మాణం ముందుకు సాగుతోంది. చిత్ర యూనిట్ త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.