|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Amritha Aiyer: సైలెంట్ అయిపోయిన ‘హనుమాన్’ హీరోయిన్..

Published: 14-05-2025, 8:31 AM
Amritha Aiyer: సైలెంట్ అయిపోయిన ‘హనుమాన్’ హీరోయిన్..

మలయాళ బ్యూటీ అమృత అయ్యర్ ‘పద్మహ్యూహం’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘హనుమాన్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇటీవల కాలంలో సినిమాల్లో కనిపించకపోవడం గమనార్హం.

Key Points

1

అమృత అయ్యర్ ‘హనుమాన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2

సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు రావలసి ఉండగా, అలా జరగలేదు.

4

సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్‌గా లేకపోవడం అభిమానులను నిరుత్సాహపరుస్తోంది.

అమృత అయ్యర్‌ సినీ ప్రస్థానం

మలయాళ బ్యూటీ అమృత అయ్యర్ (Amritha Aiyer) ‘పద్మహ్యూహం’ చిత్రంతో 2012లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. తన నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు ‘పదైవీరన్’ అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా తన జర్నీని స్టార్ట్ చేసింది. ఇక రామ్ పోతినేని ‘రెడ్’ సినిమాతో తెలుగు ప్రేక్షులను పలకరించిన అమృత.. ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత పలు ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో హీరోయిన్ రాణిస్తున్న ఈ బ్యూటీ.. 2024లో వచ్చిన ‘హనుమాన్’ (Hanuman)చిత్రంతో ఒక్కసారిగా తన క్రేజ్ మరింత పెంచుకుంది. దీంతో తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుందని అంతా భావించారు. కానీ అనుకున్నట్లు ఏం జరగలేదు.. గతేడాది ‘బచ్చలమల్లి’ (Bachchalamalli)సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మరో మూవీ అనౌన్స్ చెయ్యలేదు. అంతే కాకుండా.. ఈ మధ్య కాలంలో అమృత అయ్యర్ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్‌గా ఉండక పోవడంతో.. ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి సినిమాతో మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

‘హనుమాన్’ తర్వాత ఆమె నిశ్శబ్దం

అభిమానుల ఆందోళన

‘హనుమాన్’ తర్వాత అమృత అయ్యర్ సినిమాల్లో కనిపించకపోవడం, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేకపోవడం ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. త్వరలోనే మంచి సినిమాతో ఆమె మళ్ళీ తెరమీదకు రావాలని కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.