|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సెన్సార్ గండం దాటిందా? U/A సర్టిఫికెట్.. ఇక థియేటర్లలో సందడే!

Published: 09-01-2026, 6:15 AM
నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' సెన్సార్ గండం దాటిందా? U/A సర్టిఫికెట్.. ఇక థియేటర్లలో సందడే!
  • నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
  • ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది.
  • సినిమా రన్ టైం 2 గంటల 20 నిమిషాలుగా నిర్ణయించారు.
  • జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. జనవరి 14న సినిమా విడుదల కానుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Censor: సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలలో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) హీరోగా నటించిన అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) సినిమా ఒకటి. డైరెక్టర్ మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ వచ్చినట్లు చిత్ర బృందం తెలియజేస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు. అదేవిధంగా ఈ సినిమాకు 2 గంటల20 నిమిషాల రన్ టైం కూడా లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఇలా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈ సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేశాయి. తాజాగా ట్రైలర్ విడుదల చేయగా ట్రైలర్ కు మంచి ఆదరణ లభిస్తుంది.

ఈ ట్రైలర్ వీడియో సినిమాపై అంచనాలను పెంచడమే కాకుండా కచ్చితంగా ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టికి జోడిగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కామెడీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ వస్తుందో తెలియాల్సి ఉంది. నవీన్ పోలిశెట్టి చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.

U/A సర్టిఫికెట్ పొందిన చిత్రం

#AnaganagaOkaRaju Certified U/A 👑🙌🏻 Where laughter has no age limit 😄 #AORTrailer — https://t.co/TUVGz08kik #AOR In Cinemas on Jan 14th 🤩 #AORonJan14th Star Entertainer @NaveenPolishety @Meenakshiioffl #Maari @MickeyJMeyer @dopyuvraj @vamsi84 #SaiSoujanya @SVR4446 … pic.twitter.com/re1nsoNkFA

— Sithara Entertainments (@SitharaEnts) January 9, 2026

జనవరి 14న విడుదల కానున్న సినిమా

ఈ సినిమా అనంతరం ఈయన అనగనగా ఒక రాజు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించడంతో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. మీనాక్షి చౌదరి ఇటీవల వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు. ఈమె గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా అనంతరం ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి ఈ సంక్రాంతి మీనాక్షి చౌదరికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో సినిమా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధంగా ఉంది. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.