
📌 Key Points
- నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘అనగనగా ఒక రాజు’.
- ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
- ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 60 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది.
- ఈ చిత్రం నైజాంలో 12.5 కోట్లు, సీడెడ్‌లో 4.5 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు చూద్దాం.
సినిమా నిర్మాణం మరియు నటీనటులు
Anaganaga Oka Raju Collections : యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకుంది. కామెడీ ఎంటర్టైనర్ గా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ జనాలను కడుపుబ్బాని నవ్వించడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపించింది. జనవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీకి మంచి వసూళ్లు అందాయి. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరీ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ఇది..ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.. ఈ సినిమాలు క్లోజింగ్ కలెక్షన్స్ ఒకసారి తెలుసుకుందాం..
రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, గోపరాజు రమణ వంటి నటీనటులు కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందించారు. యువరాజ్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహించారు.. రిలీజ్ కి ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయిన తర్వాత అంతకుమించి వసూళ్లను అందుకుంది. ఫ్రీ రిలీజ్ బిజినెస్ తో మంచి రేటుకు అమ్ముడు పోయింది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్లను కూడా భారీగానే వసూలు చేసింది. పొలిటికల్ టచ్‌తో కంప్లీట్ రూరల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల రూపాయలతో నిర్మించారు.. ఫైనల్ గా ఈ మూవీకి 110 కోట్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. అంటే సినిమాకు భారీ లాభాలు వచ్చినట్లే..
బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు
ఏ ఏ ప్రాంతాల్లో ఎంత కలెక్షన్లు?
అనగనగా ఒక రాజు డిఫరెంట్ స్టోరీ తో లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ మూవీ జనవరి 14న రిలీజ్ అయింది. కామెడీ వర్కౌట్ అవడంతో సినిమాకు కలెక్షన్లు కూడా కలిసి వచ్చాయి. క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. నైజాంలో 12.5 కోట్లు, సీడెడ్‌లో 4.5 కోట్ల, ఈస్ట్ గోదావరి జిల్లాలో 4 కోట్లు, గుంటూరు జిల్లాలో 2.5 కోట్లు, వెస్ట్ గోదావరి 2.25 కోట్లు, కృష్ణా జిల్లాలో 2 కోట్లు, నెల్లూరు జిల్లాలో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. ఈ సినిమా 36 కోట్ల రూపాయల షేర్, 60 కోట్లు, పైగా వసూళ్లను సొంతం చేసుకుంది. కర్ణాటకలో 5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1 కోటి రూపయాలు, మొత్తం వరల్డ్ వైడ్ గా దాదాపుగా 110 వసూల్ చేసినట్లు టీం అనౌన్స్ చేసింది.. దాదాపు 40 కోట్ల నుంచి 110 కోట్ల వరకు కలెక్షన్లు రావడంతో ఈ మూవీ భారీ సక్సెస్ ని అందుకున్నట్లు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి రెండు మూడు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలుస్తుంది..
మొత్తం మీదగా చూస్తే ‘అనగనగా ఒక రాజు’ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టిందని సమాచారం. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి.


