|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నా జీవితంలో నువ్వు లేవు, 30 లక్షల మందిని బ్లాక్ చేశా..అనసూయ చెప్పింది నిజమా?

Published: 28-07-2025, 5:50 AM
నా జీవితంలో నువ్వు లేవు, 30 లక్షల మందిని బ్లాక్ చేశా..అనసూయ చెప్పింది నిజమా?

ప్రముఖ నటి మరియు యాంకర్ అనసూయ తాను సోషల్ మీడియాలో 30 లక్షల మందిని బ్లాక్ చేసినట్లు చెప్పింది. ఈ సంఖ్య నమ్మశక్యం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై విస్తృత చర్చ జరుగుతోంది.

Key Points

1

అనసూయ 30 లక్షల మందిని సోషల్ మీడియాలో బ్లాక్ చేసినట్లు చెప్పింది.

2

ఈ వ్యాఖ్య నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.

4

ఒక ఇంటర్వ్యూయర్ అనసూయకు మద్దతుగా మాట్లాడారు.

అనసూయ సోషల్ మీడియా వివాదం

నటి అనసూయ సోషల్ మీడియాలో, బుల్లితెరపై, సినిమాల్లో క్రేజీ సెలెబ్రిటిగా మారిపోయారు. బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ.. క్షణం, రంగస్థలం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి చిత్రాలతో నటిగా కూడా తనదైన ముద్ర వేసింది. పుష్ప చిత్రంలో దాక్షాయణిగా అదరగొట్టింది. అనసూయ చేసే వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతుంటాయి. అందుకే ఆమె తరచుగా వివాదాల్లో నిలుస్తూ ఉంటారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనసూయ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లకు ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయాయి. సోషల్ మీడియాలో అనసూయకి నెటిజన్లకు ఎప్పటికీ తేలని గొడవ జరుగుతూనే ఉంటుంది. నెటిజన్లు ఏదో విధంగా కామెంట్ చేయడం ఆమె బ్లాక్ చేయడం లాంటివి షరా మామూలే.

గతంలో నెటిజన్లు అనసూయని ఆంటీ అని ట్రోల్ చేశారు. ఆ టైంలో అనసూయ చాలా మందిని బ్లాక్ చేసింది. తనని ఆంటీ అని పిలుస్తున్న వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ.. తాను సోషల్ మీడియాలో ఇప్పటి వరకు 30 లక్షల మందిని బ్లాక్ చేసినట్లు చెప్పింది. దీనితో యాంకర్ సైతం ఆశ్చర్యపోయారు. నిజంగానా అని అడిగారు.. దీనికి అనసూయ అవును.. అదే పనిగా బ్లాక్ చేసేదాన్ని.

30 లక్షల బ్లాక్ ఖాతాలు: నమ్మశక్యమా?

ఎవడైనా ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ పెట్టినా, అడ్డమైన వాగుడు వాగినా వెంటనే బ్లాక్ చేసేస్తా. నువ్వు నా జీవితంలో లేవు అన్నట్లుగా బ్లాక్ చేసేస్తా. ఆ విధంగా 30 లక్షల మందిని బ్లాక్ చేసినట్లు తెలిపింది. దీనితో నెటిజన్లు అనసూయని ఆడేసుకుంటుంటారు. అసలు ఒక మనిషికి 30 లక్షల మందిని బ్లాక్ చేయడం సాధ్యం అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు.

చెబితే కాస్తైనా నమ్మేలా ఉండాలి అని ట్రోల్ చేస్తున్నారు. రోజుకి 100 మందిని బ్లాక్ చేసినా 30 లక్షల మందిని బ్లాక్ చేయడం సాధ్యం అవుతుందా అని సెటైర్లు వేస్తున్నారు. అనసూయపై ట్రోలింగ్ ఎక్కువవుతుండడంతో ఆమెని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ స్పందించారు. అనసూయ చెప్పినట్లు 30 లక్షల మందిని బ్లాక్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఆమె చెప్పిన నంబర్ తప్పై ఉండొచ్చు.

నెటిజన్ల ప్రతిస్పందనలు

కానీ ఆమె నిజంగానే చాలా మందిని బ్లాక్ చేసింది. అంతలా ఆమె నెగిటివిటి ఎదుర్కొంటున్నారు. ఆమె నెగిటివిటీ ఎదుర్కొంటూ ఎదిగారు. అలాంటి అనసూయని మళ్ళీ ఇప్పుడు ట్రోల్ చేయడం తగదు అని సదరు యాంకర్ నెటిజన్లని రిక్వస్ట్ చేశారు.

A post shared by Mahendra borra (@rjmahionair)

అనసూయ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. నెటిజన్ల ప్రతిస్పందనలు వైవిధ్యంగా ఉన్నాయి. అయితే, ఆమె ఎదుర్కొంటున్న నెగటివిటీని గుర్తుంచుకోవడం ముఖ్యం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.