
జబర్దస్త్ యాంకర్స్ అనసూయ, రష్మీల మధ్య భావోద్వేగ క్షణాలతో కూడిన ప్రోమో వైరల్‌గా మారింది. జబర్దస్త్ 12వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రోమో విడుదలైంది. రష్మీ స్టేజిపై ఏడ్చడంతో అనసూయ కూడా ఎమోషనల్ అయ్యారు.
Key Points
జబర్దస్త్ 12వ వార్షికోత్సవంలో అనసూయ, రష్మీ భావోద్వేగ క్షణాలు
రష్మీ స్టేజిపై ఏడ్చిన విషయం ప్రోమోలో వైరల్
ఫుల్ ఎపిసోడ్ ఆగస్టు 8, 9 తేదీల్లో ఈటీవీలో ప్రసారం
జబర్దస్త్ వార్షికోత్సవం
Anasuya – Rashmi : గతంలో జబర్దస్త్ కి అనసూయ, రష్మీ యాంకర్స్ గా చేసిన సంగతి తెలిసిందే. అనసూయ జబర్దస్త్ మానేసి సినిమాలతో బిజీ అవ్వగా రష్మీ ఇంకా జబర్దస్త్ చేస్తుంది. తాజాగా జబర్దస్త్ 12 ఏళ్ళ సెలబ్రేషన్స్ చేయగా పాత వాళ్ళందర్నీ పిలిపించారు. ఈ క్రమంలో అనసూయ కూడా వచ్చింది.
తాజాగా జబర్దస్త్ 12 ఏళ్ళ సెలబ్రేషన్స్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో అనసూయ కామెంట్స్ వైరల్ గా మారాయి. స్టేజిపై రష్మీ ఏడ్చేయగా అనసూయ ఎమోషనల్ అయింది.
అనసూయ, రష్మీ మధ్య భావోద్వేగాలు
అనసూయ మాట్లాడుతూ..జీవితం బోల్డన్ని అవకాశాలు ఇవ్వదు అంటారు కానీ తప్పకుండా ఇస్తుంది. నేను కొంతమందితో ప్యాచప్ చేసుకోవాలి అంటూ రష్మిక దగ్గరికి వెళ్లి హత్తుకుంది. దీంతో రష్మిక ఏడ్చేసింది. అనసూయ.. ఎవరికీ తెలియనివి కొన్ని ఇప్పుడు తెలిసిపోయేలా ఉన్నాయి ఈ ప్యాచప్ వల్ల, ఓ వీళ్ళిద్దరూ మాటాడుకోవట్లేదా అని చెప్పింది. దీనికి రష్మీ.. అదేదో వాట్సాప్ లో గాని ఫోన్ చేసి గాని మాట్లాడి ఉంటే అయిపోయేది కదా అంటే అలా అయితే చాలా ఇగోలు అడ్డు వస్తాయి అని అనసూయ తెలిపింది.
ప్రోమో వైరల్‌గా మారింది
దీంతో గత కొన్నాళ్లుగా రష్మీ – అనసూయ మాట్లాడుకోవట్లేదని తెలుస్తుంది. వీరిద్దరి మధ్య ఏమైనా విబేధాలు వచ్చాయా లేక ఇద్దరూ వాళ్ళ వర్క్స్ తో బిజీగా ఉండటం వల్ల మాట్లాడుకోవట్లేదా తెలియాలి. మరి ఫుల్ ఎపిసోడ్ లో అనసూయ వీరి ఇష్యూ గురించి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఈ ఫుల్ ఎపిసోడ్ ఆగస్టు 8,9 తేదీల్లో రాత్రి ఈటీవీలో 9 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ అవ్వనుంది. మీరు కూడా ఈ జబర్దస్త్ ప్రోమో చూసేయండి..
జబర్దస్త్ 12వ వార్షికోత్సవం ప్రోమోలో చూపించిన అనసూయ, రష్మీ మధ్య సంఘటనలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పూర్తి ఎపిసోడ్ కోసం ఆగస్టు 8, 9 తేదీలను ఎదురు చూడాలి.


