|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘ఆంటీ’ అంటే లక్షన్నర ఫైన్! లండన్ కోర్టు సంచలన తీర్పుపై అనసూయ స్ట్రాంగ్ రియాక్షన్!

Published: 10-04-2026, 2:05 PM
షాకింగ్: 'ఆంటీ' అంటే లక్షన్నర ఫైన్! లండన్ కోర్టు సంచలన తీర్పుపై అనసూయ స్ట్రాంగ్ రియాక్షన్!
  • లండన్‌లో ‘ఆంటీ’ అని పిలిస్తే రూ. 1.5 లక్షల ఫైన్ విధించే కోర్టు తీర్పు సంచలనం.
  • అనసూయ ఈ తీర్పును ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ట్రోలర్స్‌కు గట్టి హెచ్చరిక చేసిందనే చర్చ జరుగుతోంది.
  • గతంలో తనను ఆంటీ అని ట్రోల్ చేసిన వారిపై అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
  • ఆడవాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలను అనసూయ ఖండించిన విషయం తెలిసిందే.

లండన్‌లోని ఒక కోర్టు ‘ఆంటీ’ అని పిలిచినందుకు భారీ ఫైన్ విధించింది. ఈ తీర్పుపై నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో స్పందించారు. ఆమె గతంలో తనను ట్రోల్ చేసినవారికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.

లండన్ కోర్టు సంచలన తీర్పు

Anasuya Post :అనసూయ భరద్వాజ్…సోషల్ మీడియాలో ఫొటోస్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఎంత యాక్టివ్ గా ఉంటుందో, వాటి కింద అసభ్యంగా ట్రోల్ చేస్తూ కామెంట్స్ పెడితే అంతే వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది.ఇక ఈ మధ్య కాలంలో నటుడు శివాజీ ఇష్యూలో ఈ బ్యూటీ చుట్టూ జరిగిన రచ్చ అంత ఈజీగా మర్చిపోలేం కూడా.ఇక ఇదిలా ఉంటె తాజాగా ఈ అమ్మడు చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది.

ఒక వ్యక్తికి ఏకంగా రూ. 1.5 లక్షల ఫైన్

మ్యాటర్ లోకి ఎంట్రీ ఇస్తే.. యూకేలో జరిగిన కోర్ట్ ఇచ్చిన  ఓ వింత తీర్పును సోషల్ మీడియాలో అనసూయ పోస్ట్ చేసింది. మాములుగా మనం కాస్త ఏజ్ లో పెద్ద వాళ్ళని ఆంటీ అనడం చాలా కామన్. కానీ లండన్‌లోని ఓ కోర్టు ఇలా పిలిస్తే ఫైన్ కట్టాలంటూ తీర్పు చెప్పేసింది.అవును…ఒక లేడీని ‘ఆంటీ’ అని పిలిచిన కారణంగా ఒక వ్యక్తికి ఏకంగా రూ. 1.5 లక్షల ఫైన్ వేసి పెద్ద షాకే ఇచ్చింది.పైగా మహిళను అలా పిలవడం ఆమె గౌరవానికి భంగం కలిగించడమేనని కోర్టు తేల్చి చెప్పడం ఇక్కడ గమనార్హం.ఇపుడు ఇదే తీర్పు కి సంబందించిన  క్లిప్పింగ్‌ను అనసూయ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ  ‘హుమ్ ’ అంటూ ఒక చిన్న కామెంట్ పెట్టడంతో నెట్ట్టిల్లు డిస్కషన్స్ తో హాట్ హాట్ అయిపొయింది.

అనసూయ ట్వీట్‌తో దుమారం

ట్రోలర్స్ కి గట్టి వార్నింగ్

ఇలానే గతంలో అనసూయని ఆంటీ అంటీ అంటూ కొందరు నెటిజన్లు డబల్ మీనింగ్ తో ట్రోల్ చేసిన సంగతి తెల్సిందే. ఆ టైంలో అనసూయ వారికి వ్యతిరేఖంగా సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసి వారిపై ఫైట్ చేశారు కూడా. ఇక ఇపుడు లండన్ కోర్టు ఇచ్చిన తీర్పుని అనసూయ పోస్ట్ చేయడం చూస్తె ఆంటీ అని డబల్ మీనింగ్ తో పిలిచే ట్రోలర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్.

దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ సామాన్లు అంటూ

అయితే అనసూయ కేవలం తనపైనే కామెంట్స్ చేసేవారిపైనే కాకుండా ఆడవాళ్ళ వ్యక్తి గత స్వేచ్చ విషయంలోనూ అనేక సార్లు గొంతెత్తింది కూడా.ఇక దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ సామాన్లు అంటూ ఆడవాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ పై చేసిన కామెంట్స్ ని ఖండిస్తూ,ఆడది తనకి నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు ఉంటుంది అంటూ అనసూయ ఓపెన్ గానే కౌంటర్ ఇవ్వడం, ఆ తర్వాత కొన్ని రోజులపాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అనసూయే టార్గెట్ అవడం అంత ఈజీగా మర్చిపోలేము.

ట్రోలర్స్‌కు అనసూయ వార్నింగ్

సగం మంది కోట్లల్లో ఫైన్లు కట్టుకుంటూ ఉండాలేమో

ఇక ప్రస్తుతం లండన్ జడ్జ్మెంట్ ని కోట్ చేస్తూ అనసూయ పెట్టిన పోస్ట్ కి కొందరు ‘ట్రోలర్స్ కి అనసూయ ఇస్తున్న వార్నింగ్ మాములుగా లేదుగా’ అని కొందరు కామెంట్ చేస్తుంటే,’ఇలా మన ఇండియాలో కూడా ఆంటీ అంటేనే ఇలా కేస్ చేసి ఫైన్ వేస్తె  జనాభాలో సగం మంది కోట్లల్లో ఫైన్లు కట్టుకుంటూ ఉండాలేమో’ అంటూ మరికొంత మంది  మీమ్స్ వేస్తున్నారు.చూడాలి మరి ముందు ముందు మన దేశం లో కూడా ఇలాంటి తీర్పులు వస్తాయేమో !

లండన్ కోర్టు తీర్పును అనసూయ సమర్ధించడంతో, ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడేవారికి ఇది ఒక గుణపాఠం కావొచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.