|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనసూయ సవాల్: బికినీ ఫోటోలతో శివాజీకి దిమ్మతిరిగే కౌంటర్! న్యూ ఇయర్ షాక్!

Published: 01-01-2026, 6:00 AM
అనసూయ సవాల్: బికినీ ఫోటోలతో శివాజీకి దిమ్మతిరిగే కౌంటర్! న్యూ ఇయర్ షాక్!
  • నటుడు శివాజీ ఆడవారి బట్టలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
  • శివాజీ వ్యాఖ్యలపై అనసూయ ఘాటుగా స్పందిస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.
  • న్యూ ఇయర్ సందర్భంగా అనసూయ తన భర్తతో బికినీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
  • ఆ ఫోటోలతో పాటు పోస్ట్ చేసిన కామెంట్ శివాజీకి, ట్రోలర్స్‌కు కౌంటర్‌గా నిలిచింది.

యాంకర్ అనసూయ మరోసారి వార్తల్లో నిలిచింది. నటుడు శివాజీ ఆడవారి బట్టలపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా న్యూ ఇయర్ రోజున బికినీ ఫోటోలను షేర్ చేసింది. తన భర్తతో కలిసి వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలతో పాటు, ఘాటైన సందేశాన్ని పంపింది.

శివాజీ వ్యాఖ్యలు – అనసూయ ఘాటు స్పందన

యాంకర్ అనసూయ నిత్యం ఏదో విధంగా వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. వివాదాలు కూడా అనసూయని వెంటాడుతూ ఉంటాయి. ఎన్ని వివాదాలు ఎదురైనా అనసూయ వెనకడుగు వేయదు. తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూనే ఉంటుంది. ఇటీవల నటుడు శివాజీ ఆడవారి బట్టల గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో పెద్ద వివాదం అయింది. శివాజీ మహిళా కమిషన్ వద్ద వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలో చాలా మంది శివాజీని తీవ్రంగా విమర్శించారు. కొందరు సపోర్ట్ చేశారు కూడా. శివాజీని విమర్శించిన వారిలో అనసూయ, చిన్మయి ప్రథమంగా ఉన్నారు. శివాజీపై అనసూయ కాస్త ఘాటుగానే స్పందించింది. శివాజీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో ఉన్నారు అంటూ అనసూయ విమర్శించింది. ఇద్దరి మధ్య మాటలు ఎక్స్ ఛేంజ్ అయ్యాయి. అనసూయ అనవసరంగా ఇందులోకి వచ్చింది అని, ఆమె పేరు కూడా తాను ప్రస్తావించలేదు అని శివాజీ అన్నారు. అనసూయ మాట్లాడుతూ శివాజీ చెప్పినంత మాత్రాన మనకి నచ్చిన బట్టలు వేసుకోకుండా ఉంటామా అని అనసూయ పేర్కొంది.

అందుకు తగ్గట్లుగానే అనసూయ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న అనసూయ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా బికినీ ఫోటోలు షేర్ చేసింది.

న్యూ ఇయర్ బికినీ ఫోటోల రచ్చ

తన భర్త భరద్వాజ్ తో న్యూ ఇయర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీలో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. తన భర్తతో ఈ ఫొటోల్లో అనసూయ రొమాంటిక్ గా కనిపిస్తోంది. కానీ ఆమె ఈ ఫోటోలు షేర్ చేస్తూ పెట్టిన కామెంట్ మాత్రం చాలా ఘాటుగా ఉంది.

ఆమె చేసిన కామెంట్ శివాజీకి కౌంటర్ ఇచ్చినట్లుగానే ఉంది. అనసూయ తన పోస్ట్ లో.. అదే మహిళ, అదే ధైర్యం.. కానీ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నా. ఈ ఏడాది మరింత ఉన్నతి ప్రశాంతత ఉంటుంది. అదే సమయంలో చెత్త వాగుడుని అస్సలు సహించేది లేదు. ఎలాంటి గిల్టీ లేకుండా తినడం, హద్దులు లేకుండా ప్రయాణించడం, భయం లేకుండా మాట్లాడడం నాకు ఇష్టం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని అనసూయపోస్ట్ చేసింది.

కౌంటర్‌గా నిలిచిన అనసూయ సందేశం

తన పోస్ట్ లో అన్ అపాలజెటిక్, అన్ స్టాపబుల్, ఒపీనియన్స్ వెల్కమ్, రెస్పెక్ట్ మ్యాండేటరీ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. ఇదంతా చూస్తుంటే శివాజీకి, ట్రోలర్స్ కి ఆమె కౌంటర్ ఇచ్చినట్లుగానే ఉంది.

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

అనసూయ పోస్ట్, బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది శివాజీకి, ట్రోలర్స్‌కు ఆమె ఇచ్చిన ధైర్యవంతమైన సమాధానంగా నెటిజన్లు భావిస్తున్నారు. అనసూయ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఎప్పుడూ చర్చనీయాంశమే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.