|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యాంకర్ శ్రీముఖికి షాకిచ్చిన స్టార్ మా.. ఆమె షో మరో యాంకర్ చేతిలోకి

Published: 13-12-2025, 3:48 AM
యాంకర్ శ్రీముఖికి షాకిచ్చిన స్టార్ మా.. ఆమె షో మరో యాంకర్ చేతిలోకి
  • బుల్లితెర యాంకర్ శ్రీముఖి స్టార్ మాలో ఎన్నో టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
  • స్టార్ మా సడెన్ గా ‘బీబీ జోడి’ సీజన్ 2 హోస్టింగ్ బాధ్యతలను శ్రీముఖి నుండి యాంకర్ ప్రదీప్‌కు అప్పగించింది.
  • ఈసారి ‘బీబీ జోడి 2’కి జడ్జిలుగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, హీరోయిన్ శ్రీదేవి కొనసాగనున్నారు.
  • అమర్ దీప్-నైనిక, శ్రీ సత్య-అర్జున్ కళ్యాణ్ వంటి బిగ్ బాస్ జోడీలు ఈ సీజన్ లో పాల్గొననున్నాయి.

శ్రీముఖి స్టార్ మాలో అనేక షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ వచ్చింది. అయితే, ఆమెకు షాకిస్తూ ‘బీబీ జోడి’ సీజన్ 2 హోస్టింగ్‌ను స్టార్ మా ప్రదీప్‌కు అప్పగించింది. కొత్త జడ్జిలు, సెలబ్రిటీ జోడీలతో ఈ షో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్టార్ మాలో శ్రీముఖి ఆధిపత్యం

బుల్లితెర యాంకర్ శ్రీముఖికి పరిచయం అవసరం లేదు. ఎన్నో సంవత్సరాలుగా ఆమె టీవీ షోలు చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. సినిమా హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకునే శ్రీముఖికి.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతే ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.

శ్రీముఖి తన కెరీర్ ని ఈటీవీతో మొదలుపెట్టినా… ప్రస్తుతం స్టార్ మాలో కంటిన్యూ అవుతోంది. స్టార్ మాలో కంటిన్యూ అవుతోంది అనే కంటే… ఒంటి చేత్తో ఆ ఛానెల్ ని నడిపిస్తోందని చెప్పొచ్చు. ఆ ఛానెల్ కి సంబంధించిన ఏ షో అయినా యాంకరింగ్ శ్రీముఖి మాత్రమే చేస్తూ వస్తోంది. గతంలో చాలా మంది యాంకర్స్ పని చేసినా.. ప్రస్తుతం ముఖ్యమైన టీవీ షోలు, ఈవెంట్స్ అన్నీ ఒక్కతే హ్యాండిల్ చేస్తుంది.

శ్రీముఖికి స్టార్ మా షాక్: బీబీ జోడి 2కి ప్రదీప్

ఆదివారం విత్ స్టార్ మా పరివారం తో పాటు… బీబీ జోడి, నీతోనే డ్యాన్స్, కిరాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్ లాంటి అన్ని షోలకు తానే యాంకరింగ్ చేస్తూ వస్తోంది. సడెన్ గా స్టార్ మా….. శ్రీముఖికి షాక్ ఇచ్చింది. గతంలో బీబీ జోడి అనే ప్రోగ్రామ్ జరిగిన సంగతి తెలిసిందే. దానికి శ్రీముఖి యాంకర్ గా చేయగా, రాధ, సదా లాంటివారు జడ్జ్ లుగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సెకండ్ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేశారు.

అయితే… ఈ ప్రోమోలో యాంకర్ శ్రీముఖి కాకపోవడం గమనార్హం. ఈ సారి ఈ ప్రోగ్రామ్ ని యాంకర్ ప్రదీప్ చేతిలో పెట్టడం విశేషం. కుకు విత్ జాతి రత్నాలు తర్వాత ప్రదీప్ ఈ షోకి యాంకరింగ్ చేస్తున్నారు. బీబీ జోడి సీజన్ 2 కి కేవలం యాంకర్ మాత్రమే కాదు…జడ్జ్ లు కూడా మారిపోయారు. ఈ సారి జడ్జ్ లుగా… కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, హీరోయిన్ శ్రీదేవి లు కొనసాగనున్నారు.

కొత్త జడ్జిలు, బిగ్ బాస్ జోడీలు

ఇప్పటి వరకు బిగ్ బాస్ కి వెళ్లిన కొందరు హౌస్ మెట్స్ జోడీలుగా ఈ షోలో అడుగుపెట్టనున్నారు. ఇప్పటి వరకు పెయిర్ అవ్వని జోడీలు ఈ షోలో అడుగుపెడుతుండటం విశేషం. అమర్ దీప్- నైనిక, నయని పావని- సాయిశ్రీనివాస్, శ్రీ సత్య- అర్జున్ కళ్యాణ్, మణికంఠ ఇలా చాలా మందే ఈ ప్రోగ్రామ్ లో పాల్గొననున్నారు. త్వరలోనే రీతూ-డీమాన్ పవన్ కూడా ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బిగ్ బాస్ ముగిసిన తర్వాత.. ఇది అదే సమయంలో టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

శ్రీముఖి లేకుండా ‘బీబీ జోడి’ సీజన్ 2ను ప్రదీప్ హోస్ట్ చేయనుండటం ఆసక్తికరంగా మారింది. కొత్త యాంకర్, జడ్జిలు, విభిన్నమైన జోడీలతో ఈ సీజన్ ఎలాంటి రెస్పాన్స్ పొందుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.