
📌 Key Points
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నక్సల్స్ రహితంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటన.
- మావోయిస్టు నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న లొంగుబాటు.
- లొంగిపోయిన నక్సల్స్‌కు తక్షణ సాయంగా రూ.20,000 అందజేత.
- కృష్ణా, ఏలూరు జిల్లాల్లో 50 మందికి పైగా మావోయిస్టు కమిటీ సభ్యుల అరెస్టు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నక్సల్స్ రహితంగా మారిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. మావోయిస్టు నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్నతో పాటు పలువురు సభ్యులు లొంగిపోయారు. కేంద్రం యొక్క హెచ్చరికలు మరియు ప్రభుత్వ పథకాలే దీనికి కారణం.
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నక్సల్ రహిత రాష్ట్రంగా మారిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. మావోయిస్టు ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్నతోపాటు ఏఓబీ ప్రత్యేక జోనల్, ఏరియా, డివిజనల్ కమిటీలకు చెందిన పలువురు సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయడానికి కేంద్రం మార్చి 31ని గడువుగా నిర్ణయించిన విషయం తెలిసిందే.
కేంద్రం హెచ్చరికల అనంతరం పలువురు నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారని డీజీపీ తెలిపారు. సోమవారం(మార్చి 30) మీడియాతో మాట్లాడుతూ.. నారాయణ రావుతో సహా తొమ్మిది మంది మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టారని డీజీపీ చెప్పారు. అరెస్టు అయిన వారిలో పోడియం రాజే, కర్తం అడామే, ముచ్చిక మాస, మాడావి జోగి, ముచ్చిక లక్ష్మణ్, కడిటి హుర్రే ఉన్నారు.
చెల్లూరి నారాయణరావుపై రూ.25 లక్షలు, కర్తంపై రూ.5 లక్షలు, పొడియం రాజే, ముచ్చిక మాస, మడావి జోగి, కర్తం ఆడమెల తలా రూ.4 లక్షలు, మడివి ఆడమ, ముచ్చిక లక్ష్మణ్, కడిటి కుర్రెలపై రూ.లక్ష రివార్డు ఉన్నట్లు డీజీపీ తెలిపారు. మొత్తం వారి ఖాతాలకు బదిలీ చేస్తామన్నారు. లొంగిపోయిన నక్సల్స్‌కు తక్షణ సాయంగా రూ.20,000 అందజేశారు.
లొంగిపోయిన మావోయిస్టులు, కారణాలు
లొంగుబాటు సందర్భంగా భారీ ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల గ్రామాలకు చేరుతుండటం, ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా మార్పు కారణంగా ఉద్యమ ఉనికి తగ్గుతోందని సోమన్న చెప్పారు. అందుకే సాయుధ పోరాటాన్ని వీడి లొంగిపోయినట్లు వెల్లడించారు.
ఇటీవలి కాల్పుల ఘటనలో 18 మంది నక్సల్స్ హతమయ్యారు. కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 50 మందికి పైగా మావోయిస్టు కమిటీ సభ్యులను కూడా అరెస్టు చేశారు.
స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, అరెస్టులు
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన నారాయణరావు సుమారు 35 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. 1989లో పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మిలిటరీ ఆపరేషన్లలో ఆరితేరారు. కిందటి ఏడాది అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక నేతలు గాజర్ల రవి, అరుణ మరణం తర్వాత.. ఏవోబీ బాధ్యతలను సోమన్న చేపట్టారు. సోమన్న మీద ఏపీతోపాటుగా ఒడిశాలో పలు కేసులు ఉన్నాయి.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
డీజీపీ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారడం ఒక మైలురాయి. ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు మరియు పోలీసుల కృషి ఫలితంగా ఈ విజయం సాధ్యమైంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి శుభసూచకం.


