|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనిల్ రావిపూడి మూవీలో కృతి శెట్టి ఫిక్స్! ఇక సక్సెస్ ఆమె వెంటేనా?

Published: 05-04-2026, 11:35 AM
అనిల్ రావిపూడి మూవీలో కృతి శెట్టి ఫిక్స్! ఇక సక్సెస్ ఆమె వెంటేనా?
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా సినిమా.
  • కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నట్లు అనిల్ రావిపూడి కన్ఫర్మ్ చేశారు.
  • కీర్తి సురేష్ వెంకటేష్ సరసన నటించే అవకాశం ఉందని అంచనాలు.
  • కృతి శెట్టికి ఈ సినిమాతో మళ్ళీ సక్సెస్ వస్తుందని అభిమానుల ఆశాభావం.

టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాలో కృతి శెట్టి నటిస్తునట్లు అధికారికంగా ప్రకటించారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి కనిపించనుంది.

అనిల్ రావిపూడి సినిమాలో కృతి శెట్టి

Kriti shetty -Anil Ravipudi: టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి ప్రస్తుతం తన పదవ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ఇటీవల చిరంజీవితో కలిసి మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన పదవ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అనిల్ రావిపూడి (Anil Ravipudi)తన పదవి సినిమాని తిరిగి వెంకటేష్ (Venkatesh)తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకోవడంతో తదుపరి సినిమాపై కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు కళ్యాణ్ రామ్ (Kalyan Ram)కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఇద్దరి హీరోల గురించి అధికారకంగా ప్రకటన చేశారు. ఇక హీరోయిన్ల గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. వెంకటేష్ జోడిగా కీర్తి సురేష్ నటించ బోతున్నారని అలాగే కళ్యాణ్ రామ్ జోడిగా కృతి శెట్టి (Kriti Shetty)నటించబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి కానీ ఇప్పటివరకు అధికారకంగా వెల్లడించలేదు . తాజాగా ఈ విషయంపై అనిల్ రావిపూడి అధికారకంగా తెలియజేశారు.

అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్

అనిల్ రావిపూడి తాజాగా ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సినిమాని తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ రావిపూడి కృతి శెట్టి గురించి మాట్లాడుతూ సి యు సూన్ ఆన్ సెట్ అంటూ తెలియచేశారు. ఆల్రెడీ అన్నయ్యలు నువ్వు సినిమాలో నటించబోతున్నావని రాసేశారు ఇక మనం అధికారికంగా వెల్లడించాల్సిన పనిలేదు. తిరిగి మనం సెట్ లో కలుసుకుందాం అంటూ వేదికపైనే ఈయన కృతి శెట్టి తన సినిమాలో భాగం కాబోతుందని తెలియజేశారు.

కృతి శెట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కినట్టేనా?

సక్సెస్ ట్రాక్ ఎక్కినట్టేనా?

ఇలా అనిల్ రావిపూడి తన సినిమాలో కళ్యాణ్ రామ్ జోడిగా కృతి శెట్టి నటించబోతున్నారని తెలియజేయడంతో ఇక వెంకటేష్ జోడిగా కీర్తి సురేష్ కూడా కన్ఫామ్ అయ్యి ఉంటారని అభిమానులు భావిస్తున్నారు. గత కొంతకాలంగా ఎలాంటి సక్సెస్ లేక సతమతం అవుతున్న కృతి శెట్టి అనిల్ రావిపూడి డైరెక్షన్లో నటించబోతున్నారనే విషయం తెలియడంతో ఇక ఈమెకు మంచి సక్సెస్ రావడం గ్యారెంటీ అంటూ ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక కృతి శెట్టి తెలుగులో చివరిగా శర్వానంద్ తో కలిసి మనమే అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా నిరాశ పరచడంతో ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లిపోయారు. చాలా రోజుల తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఛాన్స్ అందుకోవడం అంటే కృతి శెట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లేనని అభిమానులు భావిస్తున్నారు.

మొత్తానికి కృతి శెట్టి అనిల్ రావిపూడి సినిమాలో నటించడం ఆమె కెరీర్‌కు ఒక మంచి మలుపు అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాతో ఆమె సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.