|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అనిల్ రావిపూడి సినిమా నుండి ఫహద్ అవుట్! కార్తీ ఎంట్రీతో సంచలనం!

Published: 19-02-2026, 7:35 AM
షాకింగ్: అనిల్ రావిపూడి సినిమా నుండి ఫహద్ అవుట్! కార్తీ ఎంట్రీతో సంచలనం!
  • అనిల్ రావిపూడి సినిమాలో ఫహద్ ఫాజిల్ స్థానంలో కార్తీ నటించే అవకాశం.
  • రెమ్యూనరేషన్ కారణంగా ఫహద్ ను అనిల్ రావిపూడి తొలగించారని సమాచారం.
  • ఈ సినిమాని షైన్ స్క్రీన్, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.
  • అనిల్ రావిపూడి ఇంకా స్క్రిప్ట్ రాయలేదని గతంలో తెలిపారు.

అనిల్ రావిపూడి తదుపరి సినిమాలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫహద్ ఫాజిల్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అతని స్థానంలో కార్తీ నటించే అవకాశం ఉందని సమాచారం.

ఫహద్ ఫాజిల్ అవుట్ అవ్వడానికి కారణం?

Anil Ravipudi: అనిల్ రావిపూడి పదవ సినిమా గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అనిల్ రావిపూడి మన శంకర్ వరప్రసాద్(MSVPG) గారు సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈయన తన తదుపరి చిత్రం వెంకటేష్ తో ఉండబోతుందని వార్తలు బయటకు వచ్చాయి. ఇలా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ మరో సినిమాలో నటించబోతున్నారంటూ ఈ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి ఇందులో పూజా హెగ్డే లేదా కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటించబోతున్నారని తెలియజేశారు. అయితే ఈ సినిమాలో మరొక స్టార్ హీరో క్యామియో ఉండబోతుందనే వార్తలు బయటకు వచ్చాయి.

ఈ పాత్రలో పుష్ప సినిమా విలన్ ఫహద్ ఫజిల్ (Fahadh Faasil )నటించబోతున్నారని ఈయన పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి అయితే తాజాగా పహద్ ఫాజిల్ పాత్రకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా నుంచి ఫహద్ ఫాజిల్ తప్పుకున్నారని సమాచారం. డైరెక్టర్ అనిల్ రావిపూడి హీరో ఫహద్ ను కలిసి ఈ సినిమా కథ వివరించారని తెలుస్తోంది అయితే ఈ పాత్రలో నటించడం కోసం ఈయన భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారట ఇలా అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతోనే అనిల్ రావిపూడి మరొక హీరోని సంప్రదించారని తెలుస్తోంది.

కార్తీ ఎంట్రీ నిజమేనా?

ఇలా ఈ ప్రాజెక్టు నుంచి ఫహద్ ఫాజిల్ తప్పుకోవడంతో ఈ ప్రాజెక్టులో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ పేరు పరిగణలోకి వచ్చింది. ఈ సినిమాలో కార్తీ దాదాపు నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి అనిల్ రావిపూడి సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక అనిల్ రావిపూడి సినిమా గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో గతంలో అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తాను ఇంకా స్క్రిప్ట్ కూడా రాయడం మొదలుపెట్టలేదని ఏ విషయం అయినా తానే స్వయంగా తెలియజేస్తానంటూ తెలిపారు కానీ ఈ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి.

షైన్ స్క్రీన్, సురేష్ ప్రొడక్షన్స్..

సినిమా నిర్మాణం ఎప్పుడు ప్రారంభం?

ఇక ఈ సినిమాని ఎప్పటిలాగే షైన్ స్క్రీన్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇక సైన్ స్క్రీన్ తో పాటు ఈసారి సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మాణంలో భాగం కాబోతున్నారని సమాచారం అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించబోతున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన భగవంత్ కేసరి, మన శంకర్ వరప్రసాద్ గారు ఇలాంటి సినిమాలను షైన్ స్క్రీన్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సినిమాకి కూడా నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు.ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ ఇప్పటివరకు రెండు సినిమాలలో నటించారు ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్లో పూర్తిస్థాయి సినిమా రాబోతుంది. ఇక తాజాగా అనిల్ డైరెక్షన్ లో చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారి సినిమాలో వెంకటేష్ వెంకి గౌడ అనే క్యామియో పాత్రలో నటించి సందడి చేశారు.

అనిల్ రావిపూడి సినిమా గురించి వస్తున్న ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫహద్ స్థానంలో కార్తీ నటిస్తారా లేదా వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.