|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బుల్లి రాజు పాత్ర వివాదం: నా కొడుకే బూతులు మాట్లాడుతున్నాడన్న అనిల్ రావిపూడి, సంచలన వివరణ!

Published: 15-12-2025, 10:48 AM
బుల్లి రాజు పాత్ర వివాదం: నా కొడుకే బూతులు మాట్లాడుతున్నాడన్న అనిల్ రావిపూడి, సంచలన వివరణ!
  • దర్శకుడు అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్, సందేశాలతో విజయవంతమైన చిత్రాలు తీస్తారు.
  • “సంక్రాంతికి వస్తున్నాం” రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసినా, బుల్లి రాజు పాత్రపై విమర్శలు వచ్చాయి.
  • నా కొడుకే బూతులు మాట్లాడుతున్నాడని అనిల్ వివరణ; ప్రస్తుత తరం పిల్లల స్వభావం అన్నారు.
  • జంధ్యాల ‘హాయ్ హాయ్ నాయక’ సినిమా నుండి బుల్లి రాజు పాత్రకు స్ఫూర్తి పొందినట్టు వెల్లడి.

“సంక్రాంతికి వస్తున్నాం” సినిమాలోని బుల్లి రాజు పాత్రపై వచ్చిన విమర్శలకు దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి స్పందించారు. ఇంట్లో తన కొడుకు కూడా బూతులు మాట్లాడుతున్నాడని చెబుతూ, ప్రస్తుత తరం పిల్లల స్వభావాన్ని వివరించారు. జంధ్యాల సినిమాల స్ఫూర్తితోనే ఆ పాత్రను సృష్టించినట్లు వెల్లడించారు.

అనిల్ రావిపూడి సక్సెస్ ఫార్ములా

Anil Ravipudi : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనిల్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం మీద అనిల్ రావిపూడి కి కంప్లీట్ క్లారిటీ ఉంది. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద అనిల్ చేసిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ సాధిస్తుంటాయి. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా తన సినిమా ద్వారా ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే ఉంటాడు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించి దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పెట్టారు. అనిల్ స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి ఈ సినిమాతో రుజువైంది.

అయితే అన్ని సినిమాలు అందరికీ నచ్చవు కాబట్టి కొన్ని కామెంట్స్ వినిపించడం అనేది సహజంగానే జరుగుతుంది. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ కొడుకు పాత్ర బుల్లి రాజు గురించి అప్పట్లో విపరీతమైన కామెంట్స్ కూడా వచ్చాయి. చిన్నపిల్లడితో అనిల్ రావిపూడి బూతులు మాట్లాడించాడు అంటూ చాలామంది కామెంట్ చేశారు.

బుల్లి రాజు పాత్రపై సంచలన స్పందన

ఆ కామెంట్స్ కి మరోసారి క్లారిటీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఎవరి వరకు ఎందుకు ఇంట్లో నా పుత్ర రత్నమే బూతులు మాట్లాడుతూ ఉంటాడు. ఇలా జరుగుతుంది చూసుకోవాలి అనే ప్రతి పేరెంట్ కి నేను మెసేజ్ ఇచ్చాను. నేను కంట్రోల్ చేసిన కూడా మావాడు కంట్రోల్ కావడం లేదు. ఈ జనరేషన్ పిల్లలు అలా ఉన్నారు అంటూ అనిల్ రావిపూడి చెప్పాడు.

నన్ను చాలామంది నేను ఆ పాత్ర క్రియేట్ చేయడం వలన నన్ను వేసుకుంటున్నారు కానీ నాకు బాగా ఇష్టమైన దర్శకుడు జంధ్యాల హాయ్ హాయ్ నాయక సినిమాలోని సన్నివేశాలనే కాపీ కొట్టి దీంట్లో నేను కొంచెం కొత్తగా రాసి పెట్టుకున్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు.

జంధ్యాల సినిమా స్ఫూర్తి, తన వివరణ

జంధ్యాల సినిమాలు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కుటుంబం అంతా కూడా కలిసి కూర్చొని చూసే ఆశయాన్ని జంధ్యాల తన సినిమాల్లో పెడుతూ ఉంటారు. ఇప్పటికీ కామెడీ ప్రస్తావన వస్తే ముఖ్యంగా అతని సినిమాలు గురించి మాట్లాడకుండా ఉండలేం. కొంతమంది అనిల్ రావిపూడి ని ఈ జనరేషన్ జంధ్యాల అని కూడా పొగిడిన రోజులు ఉన్నాయి.

అనిల్ రావిపూడి వివరణ ప్రస్తుత తరం పిల్లల స్వభావాన్ని, సినీ సృష్టికర్తలు ఎదుర్కొనే సవాళ్లను ప్రతిబింబిస్తుంది. జంధ్యాల వంటి దిగ్గజ దర్శకుల స్ఫూర్తితోనే తాను పాత్రలను తీర్చిదిద్దుతానని చెప్పడం గమనార్హం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.