
📌 Key Points
- నయనతార లేడీ సూపర్ స్టార్‌గా తెలుగు, తమిళంలో అగ్ర హీరోలతో పనిచేశారు.
- ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో నటిస్తున్నారు.
- నయనతార ప్రమోషన్స్ వీడియో చూసి అనిల్‌ను చాలామంది ఆశ్చర్యంగా ‘ఎలా ఒప్పించావు?’ అని అడిగారు.
- ఆమెను ఒప్పించడానికి పెద్దగా కారణం ఏమీ లేదని, కథ నచ్చడంతో అంగీకరించారని అనిల్ వివరించారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార సాధారణంగా ప్రమోషన్లకు దూరంగా ఉంటారు. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి సినిమాలో ఆమె పాత్ర అనౌన్స్‌మెంట్ వీడియోలో కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఆమెను ఎలా ఒప్పించారని అనిల్‌ను అడగ్గా, ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
నయనతార స్టార్‌డమ్ & అనిల్ రావిపూడితో సినిమా
Anil Ravipudi : తెలుగు ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా తన కెరీర్ మొదలుపెట్టిన నయనతార తర్వాత కాలంలో హీరోయిన్ గా మారిపోయారు. తమిళ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి స్టార్ హీరోస్ తో సినిమా చేయడంతో ఏకంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా చాలామంది స్టార్ హీరోలతో సినిమా చేశారు నయనతార.
వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి వంటి సీనియర్ స్టార్ హీరోలతో పనిచేశారు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నటిస్తున్నారు నయనతార. ఈ సినిమాలో శశిరేఖ అనే పాత్రలో కనిపిస్తున్నారు. గతంలో గాడ్ ఫాదర్ సినిమాలో కూడా నటించారు నయనతార.
ఇకపోతే అనిల్ రావిపూడి సినిమా ఎంత అద్భుతంగా తీస్తాడో అలానే జనాల్లోకి తీసుకెళ్లడంలో కూడా అదే స్థాయిలో ప్రయత్నిస్తూ ఉంటాడు. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా తన సినిమా దగ్గర అయ్యేటట్లు ప్లాన్ చేస్తుంటాడు. ప్రమోషన్స్ లో తనదొక ప్రత్యేకమైన శైలి.
నయనతార ప్రమోషన్స్ వీడియో క్రేజ్
మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా అనౌన్స్మెంట్ వీడియో కూడా చాలా క్రేజీగా చేశాడు. మెగాస్టార్ చిరంజీవి పాత సినిమాలు అన్నిటినీ కూడా గుర్తు చేశాడు అనిల్ రావిపూడి. అయితే ఈ సినిమాలో నయనతార అనౌన్స్మెంట్ వీడియో కూడా క్రేజీగా ఉంటుంది.
మెగాస్టార్ చిరంజీవి స్టైల్ లో నయనతార అనిల్ రావిపూడి కలిసి నమస్కారం పెడతారు. ఈ వీడియో అప్పట్లో బాగా పాపులర్ అయింది. అయితే కొంతమంది ఈ వీడియో చూసిన తర్వాత నయనతార అసలు ప్రమోషన్స్ కి రారు ఎలా ఒప్పించావు అంటూ అనిల్ ను అడిగారట. కేవలం అడగడం మాత్రమే కాకుండా చాలామంది షాక్ అయ్యారు అని అనిల్ రావిపూడి చెప్పాడు.
అనిల్ రావిపూడి వివరణ: నయనతార అంగీకారం
ఇకపోతే నయనతార అలా ప్రమోషన్ కి ఒప్పుకోవడానికి కారణం పెద్దగా ఏదీ లేదు అని రివిల్ చేశాడు. మామూలుగా మీతో మాట్లాడినట్టే సినిమా కాన్సెప్ట్ చెప్పాను మాట్లాడాను ఆవిడ ఇలా చేద్దాం అంటే ఒప్పుకున్నారు అని అనిల్ రావిపూడి అన్నాడు. కొంతమంది చెబుతారు కదా దైవ నిర్ణయం అన్నట్లు ఈ సినిమా విషయంలో కూడా అలానే జరిగిపోయింది అంటూ క్లారిటీ ఇచ్చాడు.
నయనతార ప్రమోషన్లలో పాల్గొనడం వెనుక పెద్ద రహస్యం ఏమీ లేదని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. ఆమెకు కథ నచ్చి అంగీకరించారని, దైవ నిర్ణయంలా జరిగిందని ఆయన చెప్పడం ఈ చర్చకు తెరదించింది.


