|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనిల్ రావిపూడి సీక్రెట్ రివీల్: సీనియర్ హీరోల వెనుక అసలు కథ ఇదేనా?

Published: 27-01-2026, 11:34 PM
అనిల్ రావిపూడి సీక్రెట్ రివీల్: సీనియర్ హీరోల వెనుక అసలు కథ ఇదేనా?
  • అనిల్ రావిపూడి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకరు.
  • ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు సంక్రాంతికి విడుదలవుతూ భారీ విజయాలు సాధించాయి.
  • సీనియర్ హీరోలతో సినిమాలు చేయాలనే తన కోరికను అనిల్ రావిపూడి బయటపెట్టాడు.
  • బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు.

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన అనిల్ రావిపూడి, సీనియర్ హీరోలతో సినిమాలు చేయడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఆయన బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు.

అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ జర్నీ

Director AnilRavipudi : టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరు అనిల్ రావిపూడి.. ఇండస్ట్రీ లోకి డైరెక్టర్ గా అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు సక్సెస్ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ ని కొట్టిన ఈ డైరెక్టర్, ఈ ఏడాది మన శంకర్ వరప్రసాద్ గారు మూవీతో మరో బిగ్గెస్ట్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన ఈ మూవీ హిట్ అయిన నేపథ్యంలో డైరెక్టర్ పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన సీనియర్ హీరోలతోనే ఎందుకు సినిమాలు చేస్తున్నాడో విషయాన్ని బయటపెట్టారు. డైరెక్టర్ అనిల్ స్టార్ హీరోలతో ఎందుకు సినిమాలు చేస్తున్నాడో ఒకసారి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లలో మోస్ట్ వాంటెడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒకరు.. ఈయన ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ మూవీస్ ను ప్రేక్షకులకు అందిస్తున్నారు. అయితే యంగ్ డైరెక్టర్లు యంగ్ హీరోలతో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ డైరెక్ట్ అనిల్ రావిపూడి మాత్రం సీనియర్ హీరోలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి కనపరుస్తుంటాడు. అందుకు కారణం కూడా లేకపోలేదు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ డైరెక్టర్ ఆ విషయం పై క్లారిటీ ఇచ్చేశాడు.. మీ జనరేషన్ డైరెక్టర్లు అందరూ కూడా యంగ్ హీరోలతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ మీరు మాత్రమే ఎందుకు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు అని అడుగుతారు యాంకర్. దానికి సమాధానం చెప్పాడు అనిల్ రావిపూడి. నేను చిన్నప్పటినుంచి ఆ హీరోలను చూస్తూ పెరిగాను వాళ్లతో ఎలాగైనా సరే సినిమా తీయాలి అని అనుకున్నాను. నాకు అదొక ఇష్టం అలా సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తున్నాను అని ఆయన అన్నారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో అనిల్ రావిపూడి మనసులో మాట బయటపడింది..

సీనియర్ హీరోలతో సినిమాలు చేయడానికి కారణం

అనిల్ రావిపూడి మనసులోని మాట

డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎప్పుడు కామెడీ సినిమాలతో ప్రేక్షకులను నవ్విస్తుంటాడు. మొదటి సినిమా పటాస్ నుంచి ఇప్పటివరకు ప్రతి ఏడాది సంక్రాంతికి ఆయన నుంచి వచ్చే మూవీ జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలైన బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవిల తో సినిమాలు చేశాడు. బాలయ్యతో భగవంత్ కేసరి, వెంకటేష్ తో సంక్రాంతి వస్తున్నాం, చిరంజీవి తో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలు చేశారు. వెంకీ మామతో గతంలో ఎఫ్2 సినిమా చేశారు. అయితే సీనియర్ హీరోలకు తగ్గట్టుగా కంటెంట్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు. అలా ప్రస్తుతం ఆయన వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. నెక్స్ట్ సంక్రాంతికి ఏ హీరోతో బిగ్గెస్ట్ హిట్ కొడతాడో చూడాలి..

అనిల్ రావిపూడి తన చిన్ననాటి కోరికను నెరవేర్చుకుంటూ, సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. ఇది ఆయన అభిమానులకు సంతోషకరమైన విషయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.