|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ చివరి సినిమా ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ రావిపూడి! అసలు కారణం ఇదేనా?

Published: 11-01-2026, 11:00 AM
విజయ్ చివరి సినిమా ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ రావిపూడి! అసలు కారణం ఇదేనా?
  • విజయ్ తలపతి చివరి సినిమా ‘జననాయగన్’ వాయిదా.
  • జననాయగన్, భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అని టాక్.
  • విజయ్ ఆఖరి సినిమాకు దర్శకత్వం వహించాలని అనిల్ రావిపూడిని కోరిన విజయ్.
  • రీమేక్ కావడంతో విజయ్ ఆఫర్ ను తిరస్కరించిన అనిల్ రావిపూడి.

కోలీవుడ్ స్టార్ విజయ్ తలపతి చివరి సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఇది. దర్శకుడు అనిల్ రావిపూడి విజయ్ చివరి సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారనే వివరాల్లోకి వెళితే…

విజయ్ చివరి సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్న అనిల్?

Vijay Thalapathy : కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటుడు విజయ్ తలపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జననాయగన్(Jananayagan) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హెచ్ వినోద్ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కింది. తెలుగు తమిళ భాషలలో ఏకకాలంలో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడటంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే ఈ సినిమా బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది అయితే ఈ విషయంపై అనిల్ రావిప్పుడు స్పందిస్తూ అన్ని సన్నివేశాలను కాకుండా కొన్ని మెయిన్ సన్నివేశాలను ఆధారంగా వారికి అనుకూలంగా ఈ సినిమాని తెరకెక్కించారని తెలిపారు. ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు ఇంటర్వ్యూలలో పాల్గొన్న అనిల్ రావిపూడి విజయ్ చివరి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.. హీరో విజయ్ కు జననాయగన్ సినిమా ఆఖరి సినిమా అనే సంగతి మనకు తెలిసిందే.

రీమేక్ కావడంతో నో చెప్పిన డైరెక్టర్

ఇక ఈయన నటించిన ఆఖరి సినిమా జన నాయగన్ కాకుండా మరే సినిమా అయినా కూడా తాను దర్శకత్వం వహించాలని నటుడు విజయ్ తనని కోరినట్లు అనిల్ రావిపూడి తెలియజేశారు అయితే ఒక డబ్బింగ్ సినిమాని రీమేక్ చేయాలని కోరడంతో అందుకు ఒప్పుకోలేదని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. తాను ఏదైనా స్ట్రైట్ సినిమా చేస్తా కానీ ఇలా రీమేక్ సినిమా చేయననీ రిజెక్ట్ చేసినట్లు అనిల్ రావిపూడి తెలియజేశారు. ఇక విజయ్ ఆఖరి సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని తాను కోరుకుంటున్నానంటూ అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మన శంకర వరప్రసాద్ పై భారీ అంచనాలు..

చిరంజీవితో అనిల్ రావిపూడి మూవీ విడుదల

కోలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వచ్చినప్పటికీ అది రీ మేక్ సినిమా కావడంతో అనిల్ రావిపూడి రిజెక్ట్ చేశారని తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అనిల్ రావిపూడి ఇప్పటివరకు చేసిన సినిమాలు ఏవి కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదు. మరి కాసేపట్లో చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిరంజీవితో కలిసి అనిల్ రావిపూడి చేసిన ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటించగా మరొక స్టార్ హీరో వెంకటేష్ కూడా గెస్ట్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలనే పెంచేసాయి. మరి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుందో తెలియాల్సి ఉంది.

అనిల్ రావిపూడి రీమేక్ చేయడానికి ఇష్టపడకపోవడంతో విజయ్ సినిమా ఆఫర్ ను తిరస్కరించారు. ప్రస్తుతం ఆయన చిరంజీవితో కలిసి చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.