
📌 Key Points
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది.
- షైన్ స్క్రీన్, సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందనుంది.
- ఎఫ్2, ఎఫ్3 సినిమాల తర్వాత అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది.
- ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతి బరిలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వెంకటేష్ హీరోగా షైన్ స్క్రీన్, సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లపై 2027 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా కోసం బడా బ్యానర్లు పోటీ పడుతున్నాయి.
సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా సందడి
Anil Ravipudi: సంక్రాంతి హిట్ మిషన్ గా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) వచ్చే సంక్రాంతికి మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 2027 సంక్రాంతికి తన సినిమా ఉంటుందని ఇప్పటికే అనిల్ రావిపూడి ప్రకటించారు. ఇలా వరుసగా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఈ ఏడాది చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారు(MSVPG) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి తన పదవి సినిమాని తిరిగి విక్టరీ వెంకటేష్(Venkatesh) తో చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులలో ఉందని మరొక పది రోజులలో ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.
సైన్ స్క్రీన్, సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో…
వెంకటేష్‌తో మరోసారి రావిపూడి జోడి
ఇదివరకే అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్లో ఎఫ్2 ,ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నా వంటి సినిమాలు విడుదల ఈ అద్భుతమైన విజయాలను అందుకున్నాయి మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటేనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో సినిమా చేయడం కోసం బడా బ్యానర్లు రంగంలోకి దిగుతున్నాయి. అనిల్ రావిపూడి వెంకటేష్ సినిమా కోసం మరోసారి షైన్ స్క్రీన్(Shine Screen) బ్యానర్ తో పాటు సురేష్ ప్రొడక్షన్(Suresh Production) బ్యానర్ కూడా నిర్మాతలు వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి షైన్ స్క్రీన్ బ్యానర్ లో భగవంత్ కేసరి సినిమాతో పాటు మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాని చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి వెంకటేష్ తో సినిమా చేయడానికి కూడా ముందుకు వచ్చారు..
ఈసారి షైన్ స్క్రీన్ బ్యానర్ తో సురేష్ ప్రొడక్షన్ కూడా భాగస్వామ్యం కాబోతున్నారు. ఇక ఈ కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా 2027 సంక్రాంతిని పురస్కరించుకొని రాబోతుందని త్వరలోనే ఈ విషయాలకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ జోడిగా ఎవరు నటించబోతున్నారు అనే అంశంపై ఎన్నో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేయడంతో ఈ వార్తలపై విభిన్న అభిప్రాయాలు వచ్చాయి. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి తన సినిమాలో ఇలాంటి డిజాస్టర్ హీరోయిన్ కి అవకాశం ఇచ్చి తన కెరియర్ ను ఇబ్బందులలో పడేసుకుంటున్నారా? ఇలాంటి డిజాస్టర్ హీరోయిన్ తో సినిమాలు అవసరమా? అంటూ వారి అభిప్రాయాలను తెలియచేయడమే కాకుండా అనిల్ రావిపూడికి అభిమానుల నుంచి హెచ్చరిక వెళ్లిందని చెప్పాలి. మరి తన కెరియర్ లో పదవ సినిమాగా రాబోతున్న ఈ స్పెషల్ మూవీలో హీరోయిన్ గా అనిల్ ఎవరిని ఎంపిక చేయబోతున్నారనేది తెలియాల్సి ఉంది.
హీరోయిన్ గా పూజా హెగ్డే?
మొత్తానికి అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


