
టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన కొత్త బ్యానర్ ‘దిల్ రాజు డ్రీమ్స్’ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజు పనితీరును ఆయన ప్రశంసించారు.
Key Points
దిల్ రాజు కొత్త నిర్మాణ సంస్థ ‘దిల్ రాజు డ్రీమ్స్’ లాంచ్.
అనిల్ రావిపూడి దిల్ రాజు పనితీరును ‘రన్నింగ్ రాజు’గా వర్ణించారు.
అనిల్ రావిపూడి దిల్ రాజు కొత్త ప్రయత్నానికి శుభాకాంక్షలు తెలిపారు.
కొత్త నిర్మాణ సంస్థ కొత్తవారికి అవకాశాలు కల్పిస్తుందని ఆశించారు.
దిల్ రాజు కొత్త బ్యానర్ లాంచ్
తెలుగు సినీ పరిశ్రమలో టాప్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతున్న దిల్ రాజు (Dil Raju).. ఇప్పటికే ఆయన బ్యానర్ (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations))లో అనేక హిట్ సినిమాలను అందించారు. ఇప్పుడు దిల్ రాజు మరో కొత్త బ్యానర్‌ను లాంచ్ చేయబోతున్నాడు. ‘దిల్ రాజు డ్రీమ్స్’ (Dil Raju Dreams) అనే పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేయబోతున్నారు. ఈరోజు సాయంత్రం ఈ కొత్త నిర్మాణ సంస్థ గ్రాండ్ లాంచ్ ఉండగా.. సినీ పరిశ్రమ నుంచి దిల్ రాజుకు శుభకాంక్షలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ వీడియో రిలీజ్ చేశాడు.
‘నేను 2016 నుంచి దిల్ రాజుతో ట్రావెల్ అవుతున్నాను. కల్యాణ్ రామ్ బ్యానర్‌లో ‘పటాస్’తో నేను ఇంట్రడ్యూస్ అయ్యాక.. ‘సుప్రీమ్’తో రాజుతో నా జర్నీ స్టార్ట్ అయింది. దాదాపు 10 ఏళ్లు అవుతోంది. దిల్ రాజులో నేను గమనించింది ఏంటంటే.. ఆయనకు దిల్ రాజు అనే పేరు కాకుండా రన్నింగ్ రాజు అని పెట్టాల్సింది. ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటారు. ఒకచోట ఉండరు. ఏది కొత్తది వచ్చిన.. ఇంకోటి చెయ్యాలి.. ఇంకోటి చెయ్యాలి అంటూ ఎప్పుడు కొత్తదనం కోసం పరిగెడుతూనే ఉంటారు. ఎన్నో సినిమాలు చేశారు.. ఆయన బ్యానర్‌లో దాదాపు అన్నీ జోనర్స్ టచ్ చేశారు. అలాంటి ఆయన ఇప్పుడు కొత్తగా ‘దిల్ రాజు డ్రీమ్స్’తో వస్తున్నారు. ఈ కొత్త వెబ్‌సైట్‌లో మీరు కూడా లాగిన్ అయ్యి.. కొత్త కొత్త సలహాలు ఇవ్వొచ్చు. మీకు కూడా అవకాశం వచ్చే చాన్స్ ఉంటుంది. కొత్త వారికి ఆల్ ది బెస్ట్.. అలాగే దిల్ రాజుకు ఆల్ ది బెస్ట్.. ఇది మంచి విజయం అవ్వాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు. Link
అనిల్ రావిపూడి వ్యాఖ్యలు
కొత్తవారికి అవకాశాలు
అనిల్ రావిపూడి దిల్ రాజు కొత్త ప్రయత్నం ‘దిల్ రాజు డ్రీమ్స్’కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త వెంచర్ సినీ పరిశ్రమకు మరిన్ని అవకాశాలను కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


