|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పేరుతో మరో హీరో.. దసరాకి షూటింగ్ పూర్తి.. కామెడీ సినిమాతో..

Published: 02-10-2025, 6:47 AM
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పేరుతో మరో హీరో.. దసరాకి షూటింగ్ పూర్తి.. కామెడీ సినిమాతో..

‘పురుష’ అనే చిత్రంతో పవన్ కళ్యాణ్ అనే యువకుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ దసరాకి పూర్తయ్యింది. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వీరు ఉలవల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది.

Key Points

1

'పురుష' చిత్రంతో కొత్త హీరో పవన్ కళ్యాణ్ పరిచయం అవుతున్నారు.

2

కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వీరు ఉలవల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

4

దసరా రోజున షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలో రిలీజ్ కానుంది.

‘పురుష’ చిత్రంతో కొత్త హీరో పవన్ కళ్యాణ్ పరిచయం

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌ అనే యువకుడు హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న సినిమా ‘పురుష:’. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు ఉలవల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. వీరు ఉలవల గతంలో మళ్లీ రావా, జెర్సీ, మసూద.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేసారు.(Pawan Kalyan)

ఈ సినిమాలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్, గబి రాక్, అనైరా గుప్తా.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

సినిమా నిర్మాణ బృందం వివరాలు

చిత్రీకరణ పూర్తి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం

తాజాగా ఓ స్పెషల్ సాంగ్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు నేడు దసరా రోజు ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కొత్త హీరో అయినా బాగా నటించాడని మూవీ యూనిట్ అంటుంది. మరి పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకొని ఇతను ఎలా మెప్పిస్తాడా చూడాలి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.

కొత్త హీరో పవన్ కళ్యాణ్ పేరుతో వస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చూడాలి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.