
📌 Key Points
- కార్తికేయ 2 షూటింగ్‌లో మేకపిల్లతో ఆడుకున్న అనుపమ, ఆ తర్వాత మటన్ బిర్యానీ తినలేకపోయారు.
- చాలా కాలం తర్వాత అనుపమ మళ్ళీ మటన్ తినడం ప్రారంభించారని తెలిపారు.
- నిఖిల్, అనుపమ కాంబినేషన్‌లో వచ్చిన 18 పేజీస్ చిత్రం కూడా మంచి విజయం సాధించింది.
- ప్రస్తుతం అనుపమ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు, ధృవ్ విక్రమ్‌తో రిలేషన్ గురించి వార్తలు వస్తున్నాయి.
ప్రేమమ్ సినిమాతో వెలుగులోకి వచ్చిన అనుపమ పరమేశ్వరన్, కార్తికేయ 2 షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి ఇటీవల వెల్లడించారు. ఆ సంఘటన కారణంగా ఆమె కొంతకాలం మటన్ తినడం మానేశారు. ఆమె మళ్ళీ తినడం మొదలుపెట్టారు.
కార్తికేయ 2 షూటింగ్‌లో అనుపమకు చేదు అనుభవం
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ పరిచయం అవసరం లేని పేరు. ప్రేమమ్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ఈమె అనంతరం తెలుగు తమిళ కన్నడ భాషలలో వరుస సినిమాలు చేస్తూ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న అనుపమ(Anupama) ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే కార్తికేయ2 సినిమా షూటింగ్లో జరిగిన ఒక సంఘటన గురించి కూడా ఈమె ఈ సందర్భంగా తెలియజేశారు. అనుపమ నిఖిల్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ 2 (Karthikeya 2)పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక ఘటన జరిగిందని అప్పటినుంచి తాను మటన్ ముట్టుకోలేదని తెలిపారు.
కార్తికేయ 2 సినిమా షూటింగ్ సమయంలో తాను ఒక మేక పిల్లతో చాలా బాగా ఆడుకున్నానని , ఆ మేక పిల్లతో ఆడుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అయితే ఆ రోజు మాకు మటన్ బిర్యానీ పెట్టారు. ఇలా నేను తింటూ ఉన్నప్పుడు తన అసిస్టెంట్ తన దగ్గరకు వచ్చి నవ్వుతూ మీరు ఇప్పుడు తింటున్న మటన్ బిర్యానీ ఇంతవరకు మీరు ఆడుకున్న మేకతో తయారు చేసిన బిర్యాని అని చెప్పారు. ఇలా తన అసిస్టెంట్ ఆ మాట చెప్పగానే తాను ఒక్కసారిగా వాంతులు చేసుకున్నానని అప్పటినుంచి మటన్ బిర్యానీ తాను ముట్టుకోలేదని ఆ ఘటన నన్ను చాలా గాయపరిచిందని అనుపమ తెలిపారు.
మళ్ళీ మటన్ తింటున్న అనుపమ
ఇలా కార్తికేయ 2 షూటింగ్ సమయంలో ఈ ఘటన తర్వాత తాను ఇంతకాలం మటన్ ముట్టుకోలేదు. అయితే ఇటీవల తిరిగి తాను మటన్ తినడం ప్రారంభించాను అంటూ ఈమె ఈ విషయాలను తెలియజేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఒక్కొక్కరు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత నిఖిల్ అనుపమ 18 పేజీస్ అనే సినిమాలో కూడా నటించారు.
ధ్రువ్ విక్రమ్ తో రిలేషన్…
ధృవ్ విక్రమ్‌తో అనుపమ రిలేషన్ నిజమేనా?
ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న అనుపమ ఇటీవల లాక్ డౌన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పలు సినిమాల షూటింగ్ పనులలో కూడా ఈమె బిజీగా ఉన్నారు అయితే ఇటీవల అనుపమ రిలేషన్ గురించి వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి ఈమె యంగ్ హీరో ధ్రువ్ విక్రంతో రిలేషన్ ఉన్నారంటూ వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా తన రిలేషన్ గురించి వార్తలు వచ్చినప్పటికీ అనుపమ మాత్రం ఎక్కడా ఈ వార్తలపై స్పందించలేదు. గతంలో కూడా ఈమె గురించి ఇలాంటి వార్తలు రావటం విశేషం.
అనుపమ మళ్ళీ మటన్ తినడం ప్రారంభించడంతో ఈ విషయం వైరల్ అవుతోంది. ఆమె సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా, వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలు కూడా చర్చనీయాంశంగా మారాయి.


