|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అనుష్క వల్లే ఖలేజా ఫ్లాప్? పరుచూరి సంచలన నిజాలు! మహేష్ బాబు ఫ్యాన్స్ దిమ్మతిరిగే న్యూస్!

Published: 02-04-2026, 7:05 AM
షాకింగ్: అనుష్క వల్లే ఖలేజా ఫ్లాప్? పరుచూరి సంచలన నిజాలు! మహేష్ బాబు ఫ్యాన్స్ దిమ్మతిరిగే న్యూస్!
  • ఖలేజా మూవీ ఫ్లాప్ అవ్వడానికి అనుష్క పాత్ర కారణమని పరుచూరి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!
  • మహేష్ బాబు కామెడీ టైమింగ్, రాజస్థాన్ ఎడారి సన్నివేశాలు సినిమాకు మైనస్ గా మారాయట!
  • అనుష్క శెట్టిని ఐరెన్ లెగ్ అని చూపించడం ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చలేదన్న పరుచూరి.
  • చిన్న చిన్న మార్పులు చేసి ఉంటే ఖలేజా బ్లాక్ బస్టర్ అయ్యేదని పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ!

టాలీవుడ్ లో కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అయినా తర్వాత క్లాసిక్ గా నిలుస్తాయి. అలాంటి సినిమాలలో మహేష్ బాబు నటించిన ఖలేజా ఒకటి. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలను పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఖలేజా ఫ్లాప్ అవ్వడానికి కారణాలు ఏమిటి?

కొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు పూర్తిగా నిరాశ పరిచి ఆ తర్వాత టీవీల్లో, ఓటీటీల్లో, యూట్యూబ్ లో దూసుకుపోతుంటాయి. అలాంటి సినిమాలు టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. వాటిలో మహేష్ బాబు నటించిన నటించిన ఖలేజా ఒకటి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది.

థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు ఈ మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేదు. కానీ ఆ తర్వాత టీవీల్లో మాత్రం జనాలు ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేశారు. ఈ మూవీ కథలో అనేక మలుపులు ఉంటాయి. కాస్త కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. సినిమా అంతా బాగానే ఉన్నప్పటికీ ఎందుకు ఫ్లాప్ అయింది అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు.

పరుచూరి గోపాలకృష్ణ ఏం చెప్పారంటే?

కన్ఫ్యూజన్, మహేష్ బాబు చేసిన కామెడీ, అనుష్క శెట్టి పాత్ర ఇలా పరాజయానికి రకరకాల కారణాలు చెప్పారు. సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఖలేజా ఫ్లాప్ కి అసలైన కారణం రివీల్ చేశారు. సినిమా అంతా బాగానే ఉన్నప్పుడు ఖలేజా చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోకపోవడానికి కారణం ఉంది.

సినిమా ప్రారంభమైనప్పుడు కథని టచ్ చేసి ఆ తర్వాత ఎక్కువ టైం రాజస్థాన్ ఏడారి సన్నివేశాలని చూపించారు అని పరుచూరి అన్నారు. చాలా సీరియస్ సన్నివేశంలో కూడా మహేష్ బాబు కామెడీ చేయడం కూడా మైనస్ అయింది. దీనివల్ల కథలో సీరియస్ నెస్ పోయింది. అదే విధంగా అనుష్క శెట్టి పాత్రని అవమానకరంగానే చూపిస్తూ వచ్చారు.

అనుష్క పాత్రపై విమర్శలు నిజమేనా?

ఆమె ఐరెన్ లెగ్ అన్నట్లుగా చూపించారు. అలా చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కి, మహిళలకు నచ్చదు. ఇలా చిన్న చిన్న లోపల సరిచేసుకుని ఉంటే ఖలేజా మూవీ హిట్ అయ్యేది అని పరుచూరి గోపాల కృష్ణ తెలిపారు.

ఖలేజా మూవీ గురించి పరుచూరి గోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.