|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనుష్క దెబ్బకు బలైన 6 సినిమాలు ఇవిగో.. ఆ ఎఫెక్ట్ వల్లే ఫేడ్ అవుట్ అయిన స్టార్ హీరో

Published: 06-11-2025, 10:07 AM
అనుష్క దెబ్బకు బలైన 6 సినిమాలు ఇవిగో.. ఆ ఎఫెక్ట్ వల్లే ఫేడ్ అవుట్ అయిన స్టార్ హీరో

అనుష్క శెట్టి టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఆమె ‘అరుంధతి’ చిత్రం అప్పట్లో అద్భుతమైన విజయాన్ని సాధించి రికార్డులు సృష్టించింది. అయితే, ఈ భారీ విజయం కొన్ని ఇతర సినిమాల విడుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది, వాటిలో కొన్ని బలవ్వగా, ఒక స్టార్ హీరో కెరీర్ కూడా దెబ్బతింది.

Key Points

1

అనుష్క 'అరుంధతి' అప్పట్లోనే 35 కోట్ల షేర్ రాబట్టి రికార్డు సృష్టించింది.

2

రామ్ పోతినేని 'మస్కా' అరుంధతి జోరు ముందు యావరేజ్ గా నిలిచింది.

4

శివాజీ 'ఇందుమతి', రవితేజ 'నేనింతే' వంటి చిత్రాలపైనా అరుంధతి ప్రభావం పడింది.

అరుంధతి ప్రభంజనం: బాక్సాఫీస్ వద్ద రికార్డులు

అనుష్క శెట్టి టాలీవుడ్ లో ఒక సంచలనం అనే చెప్పాలి. సూపర్ మూవీతో అనుష్క శెట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నెమ్మదిగా అనుష్కకి విక్రమార్కుడు, మహానంది, లక్ష్యం లాంటి విజయాలు అనుష్క క్రేజ్ ని పెంచుతూ వచ్చాయి. ఒక దశకి చేరుకున్న తర్వాత అనుష్క గ్లామర్ పాత్రలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు దర్శకులకు పర్ఫెక్ట్ ఛాయిస్ గా మారింది. అరుంధతి చిత్రంతో అనుష్క హవా మరో స్థాయికి చేరుకుంది. వరల్డ్ వైడ్ గా అప్పట్లోనే ఈ చిత్రం 35 కోట్ల షేర్ రాబట్టింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో అరుంధతి తిరుగులేని రికార్డ్ సృష్టించింది. అరుంధతి మూవీ తో అదే విధంగా కొన్ని వారాలకు అటూ ఇటూ గా విడుదలైన కొన్ని చిత్రాలు ఆ ప్రభంజనంలో కొట్టుకుపోయాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

రామ్ పోతినేని, షీలా, హన్సిక కలసి నటించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ అరుంధతి చిత్రానికి రెండు రోజుల ముందు విడుదలయింది. మస్కా చిత్రానికి మంచి టాక్ వచ్చింది. కానీ అరుంధతి మూవీ జోరు ముందు ఈ సినిమా ప్రభావం అంతగా కనిపించలేదు. మస్కా కలెక్షన్లకు అరుంధతి భారీగా గండి కొట్టింది. హిట్ కావాల్సిన మస్కా మూవీ అరుంధతి దెబ్బకు యావరేజ్ గా నిలిచింది.

అనుష్క దెబ్బకు బలైన సినిమాలు

అరుంధతి మూవీ కారణంగా తుడిచిపెట్టుకుపోయిన మారో స్టార్ హీరో సినిమా శిశిరేఖా పరిణయం. లవర్ బాయ్ తరుణ్, జెనీలియా జంటగా నటించిన ఈ మూవీ అరుంధతి చిత్రానికి కొన్ని రోజుల ముందు విడుదలైంది. అప్పటికే వరుస పరాజయాలతో తరుణ్ ఇబ్బంది పడుతున్నాడు. శశిరేఖా పరిణయం కూడా డిజాస్టర్ కావడంతో తరుణ్ కెరీర్ టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ కావడం ప్రారంభం అయింది. ఆ తర్వాత తరుణ్ ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ అవి తరుణ్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు.

అరుంధతి చిత్రానికి కొన్ని రోజుల ముందు విడుదలైన నటుడు శివాజీ సైకలాజికల్ థ్రిల్లర్ ఇందుమతి కూడా అరుంధతి ప్రభావంతో ఫ్లాప్ అయింది. ఈ చిత్రంలో శివాజీ తో పాటు శ్వేతా భరద్వాజ్ కీలక పాత్రలో నటించారు.

తరుణ్ కెరీర్‌పై అరుంధతి ప్రభావం

మస్కా, శశిరేఖా పరిణయం తో పాటు మరికొన్ని చిన్న చిత్రాలపై కూడా అరుంధతి ప్రభావం పడింది. ష్, బ్యాంక్ అనే చిత్రాలు అరుంధతి జోరు ముందు కనిపించకుండా పోయాయి. అప్పటికే నెగిటివ్ టాక్ తో నడుస్తున్న రవితేజ నేనింతే చిత్రం అరుంధతి రిలీజ్ అయ్యాక పూర్తిగా కనిపించకుండా పోయింది.

అనుష్క ‘అరుంధతి’ విజయం ఆమె కెరీర్‌లో మైలురాయి. అయితే, దాని ప్రభావం ఇతర సినిమాలపై, స్టార్ హీరోల కెరీర్‌పై తీవ్రంగా పడింది. ఒక సినిమా సృష్టించే ప్రభంజనం ఎంత గొప్పదో ఇది తెలియజేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.