|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

AP Inter Exams : ఏపీ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త – సెకండియర్‌లోనూ ఇంప్రూవ్‌మెంట్‌, నేటి నుంచే ఎగ్జామ్ ఫీజు చెల్లింపులు

Published: 19-04-2026, 9:05 PM
AP Inter Exams : ఏపీ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త - సెకండియర్‌లోనూ ఇంప్రూవ్‌మెంట్‌, నేటి నుంచే ఎగ్జామ్ ఫీజు చెల్లింపులు

ఇంటర్ విద్యలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్న ఏపీ సర్కార్… మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం మొదటి సంవత్సరం (First Year) విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్న ‘ఇంప్రూవ్‌మెంట్’ పరీక్షలను సెకండియర్ విద్యార్థులకు కూడా అమలు చేయనుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.

దేశంలోని ఇతర రాష్ట్రాల ఇంటర్ బోర్డులు అనుసరిస్తున్న విద్యా విధానాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం…. విద్యార్థులకు మేలు చేకూర్చే ఉద్దేశంతో ఈ మార్పు చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఈ నిర్ణయంతో పైచదువుల ప్రవేశాల్లో (EAPCET, JEE, NEET వంటివి) మార్కుల వెయిటేజీ కోసం ఎదురుచూసే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

పరీక్షలు రాయదలచుకున్న విద్యార్థులు రూ.600 ప్రాథమిక ఫీజుతో పాటు, ఒక్కో సబ్జెక్టుకు రూ.160 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల పబ్లిక్ పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ పాత ఐడీ నంబరుతోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇంప్రూవ్‌మెంట్ , సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు నేటి నుంచి (ఏప్రిల్ 20) ఏప్రిల్ 27 వరకు గడువు విధించారు. ఈ సమాచారాన్ని విద్యార్థులందరికీ చేరవేసేలా విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లను బోర్డు ఆదేశించింది.

ఇంటర్ మార్కులపై సంతృప్తి చెందని విద్యార్థులు మళ్లీ మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తులను స్వీకరిస్తారు.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఇక ప్రాక్టికల్స్ పరీక్షలు జూన్ 7 నుంచి ప్రారంభమై… జూన్ 11 వరకు ఉంటాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 5న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 6న నిర్వహిస్తారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.