
📌 Key Points
- మార్కాపురం బస్సు ప్రమాదం నేపథ్యంలో ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ నిఘా.
- రాష్ట్రవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు.
- నిబంధనలు ఉల్లంఘించిన 236 బస్సులపై కేసులు నమోదు, కొన్ని సీజ్.
- ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటన.
మార్కాపురం బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి
మార్కాపురంలో ప్రైవేట్ బస్సు ఘటనలో 14 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తిరుగుతున్న ప్రైవేట్ బస్సులపై రవాణాశాఖ ఫోకస్ పెట్టింది. ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది.
సరైన పత్రాలు లేని మోటార్ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి. రోడ్డు, హైవేస్, అగ్ని మాపకశాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నుంచి ఈ తనిఖీలు జరుగుతున్నాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా టోల్ ప్లాజాలు, వివిధ చెక్‌పోస్టుల వద్ద బస్సులను చెక్ చేస్తున్నారు. చింతూరు పోలీస్ స్టేషన్, పలమనేరు, నరహరిపేట, జిలుగుమిల్లి, కత్తిపూడి, పుల్లూరు టోల్ ప్లాజా, సున్నిపెంట, చిలకల్లు టోల్ ప్లాజా, బడవ టోల్ ప్లాజా, సాగర్ టోల్ ప్లాజా, దాచేపల్లి టోల్ ప్లాజా, శ్రీ కాళహస్తి టోల్గేట్, సూళ్లూరుపేట టోల్గేట్, కొడికొండ, పురుషోత్తపురం, సాలూరు బైపాస్ మొత్తం 16 పాయింట్లలో తనిఖీలు జరిగాయన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు
గురువారం సాయంత్రం నుంచి కొనసాగుతున్న డ్రైవ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1036 బస్సులను తనిఖీ చేపట్టారు. ఉల్లంఘనలు గుర్తించిన 236 బస్సులపై కేసులు నమోదు చేశారు. పలమనేరులో 2 బస్సులను సీజ్ చేసి… నగదు జరిమానాలు విధించమని మంత్రి తెలిపారు.
ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాల నివారణ కోసం కఠిన చర్యలు అమలు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక నుంచి విధిగా ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్తామన్నారు. ప్రయాణికుల భద్రత కోసం భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మార్కాపురం జిల్లా రాయవరం వద్ద గురువారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – టిప్పల్ లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సులోని 14 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో అడుగడుగునా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఉల్లంఘనలపై కఠిన చర్యలు
అంతేకాకుండా ప్రమాదానికి ముందే ట్రావెల్ బస్సులో కొన్ని మరమ్మత్తులు చేసినట్లు కూడా తెలిసింది. యర్రగొండపాలెం టోల్‌గేట్ దాటిన తరువాత బస్సుకు యాభై నిమిషాల పాటు మరమ్మతులు చేసి…. తిరిగి బయల్దేరినట్లు వెలుగులోకి వచ్చింది.
ఈ ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర రవాణాశాఖ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై నిఘా పెట్టింది. ప్రత్యేకంగా డ్రైవ్ లు చేపట్టి… ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోనుంది. బస్సుల ఫిట్నెస్, అనుమతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ప్రయాణికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ హెచ్చరించింది. భద్రత విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పింది.


